ఎన్నో ఆశలతో ఓటీటీలో రిలీజ్ అయిన నాని – సుధీర్‌బాబు వి సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇంద్రగంటి మోహన్‌కృష్ణ లాంటి సీనియర్ డైరెక్టర్ ఈ కథ చెప్పాడని దిల్ రాజు విన్నాడేమో కాని.. మరో అప్కమింట్ డైరెక్టర్ ఎవరైనా ఈ కథ చెపితే దిల్ రాజు కథ కూడా వినకుండా మధ్యలోనే వెళ్లిపోయేవాడేమో..! సరే ఏదేమైనా ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో ఇద్దరు హీరోలు పెద్ద డిజాస్టర్ నుంచి తప్పించుకున్నారనే చెప్పాలి.
బన్నీ – దిల్ రాజు ఐకాన్ చేయడానికి ముందు ఈ వి కథ బన్నీ దగ్గరకు వెళ్లిందట. వి కథ విన్న బన్నీ ఇలాంటి కథలను ఎందుకు రిఫర్ చేస్తారని తన టీం పై కస్సుబుస్సు లాడాడట. ఇక ఈ కథ మళ్లీ మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ దగ్గరకు వెళ్లింది. ఆల్రెడీ జైజవాన్ సినిమా చేసాను కదా..ఇద్దరు ప్రెండ్స్ ఒకరు విలన్..ఒకరు హీరో.. మళ్లీ అదే లైన్‌తో సినిమా వద్దని రిజెక్ట్ చేశాడట.
చివరకు దిల్ రాజు ఇద్దరు హీరోలు కథ.. ఎలగోలా వర్కవుట్ అవుతుందని.. నాని, సుధీర్‌బాబును సెట్ చేశాడు. చివరకు బాల్ నాని కోర్టులోకి వెళ్లడంతో ఈ సినిమ విగా బయటకు వచ్చింది. డిజాస్టర్ అయ్యింది. అలా బన్నీ, సాయి ధరమ్ ఈ సినిమా రిజల్ట్ ముందే ఊహించి ప్లాప్ తప్పించుకున్నారు.