Moviesప‌ర్‌ఫెక్ట్ డైలాగ్‌తో బిగ్‌బాస్ 4 లేటెస్ట్ ప్రోమో వ‌చ్చేసింది...

ప‌ర్‌ఫెక్ట్ డైలాగ్‌తో బిగ్‌బాస్ 4 లేటెస్ట్ ప్రోమో వ‌చ్చేసింది…

లాక్‌డౌన్ దెబ్బ‌తో జ‌నాలు అంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌వుతున్నారు. మ‌రోవైపు చాలా బోరింగ్‌గా ఉంది. అటు సినిమాలు లేవు. థియ‌ట‌ర్లు మూసేశారు. సినిమా షూటింగ్‌లు లేక‌పోవ‌డంతో ఎంట‌ర్టైన్‌మెంట్ న్యూస్ కూడా లేదు. ఇక ప్ర‌జ‌ల‌కు కాస్తో కూస్తో ఓటీటీ ప్లాట్ ఫామ్‌ల‌లో రిలీజ్ అయ్యే సినిమాలు, వెబ్‌సీరిస్‌లు మాత్ర‌మే గ‌తి అయ్యాయి. ఇలాంటి టైంలో బిగ్‌బాస్ తెలుగు వెర్ష‌న్ నాలుగో సీజ‌న్ ఎప్పుడు ప్రారంభ‌మ‌వుతుందో అని తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కులు క‌ళ్లు కాయ‌లు కాచేలా వెయిట్ చేస్తున్నారు.

 

 

ఇక ఈ రోజు సాయంత్రం 6 గంట‌ల‌కు బిగ్‌బాస్ షో ప్రారంభం కానుంది. మూడో సీజ‌న్ హోస్ట్ చేసిన కింగ్ నాగార్జునే నాలుగో సీజ‌న్‌కు కూడా హోస్ట్ చేయ‌నున్నారు. ఇక ఓపెనింగ్ సెర్మనికి సంబంధించి ప్రోమో ఓ రేంజ్‌లో అల్లాడిస్తోంది. దీనికి సంబంధించిన టీజర్ వదిలారు మేకర్స్, మాస్క్ ముఖానికి కానీ వినోదానికి కాదు అనే పర్ ఫెక్ట్ డైలాగ్ తో మరో ప్రోమోని వదిలారు. ఇక నాగార్జున హోస్ట్‌గా శ‌ని, ఆదివారాల్లో మాత్ర‌మే వ‌స్తారు. ఇక ఈ ప్రోమోలో కింగ్ నాగార్జున సోగ్గాడు బంగార్రాజు సందడికి సంబంధించి చిన్న హింట్ ఇచ్చి పిక్చర్ అబి బాకీ హై మెరా దోస్త్ అన్నట్టుగా ఎంట్రీ ఇవ్వ‌డం ఇంట్ర‌స్టింగ్‌గా మారింది.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news