సినిమా ఇండస్ట్రీలో పైన కనిపించేవి మాత్రమే మెరుపులు. ఈ మెరుపుల వెనక చాలా మంది పడే బాధలు తెలియవు. వెండితెరపై కనిపించేందుకు పడే కష్టాల వెనక ఉన్న కన్నీళ్లు వాళ్లకే తెలుసు.. ఇదంతా ఇలా ఉంటే కొందరు ఎన్నో కష్టనష్టాలు పడి మరీ ఈ దశకు వస్తారు. ఈ క్రమంలోనే తెలుగమ్మాయి అయిన తేజస్వి మాదివాడ వ్యక్తిగత జీవితం గురించి తెలిస్తే ప్రతి ఒక్కరికి కన్నీళ్లు ఆగవు. అసలు తెలుగమ్మాయి అంటేనే ఇక్కడ చాలా మందికి చిన్నచూపు తేజస్వి కూడా ఎన్నో కష్టాలు పడి ఎన్నో షోలు చేసి.. చివరక సినిమాల్లోకి వచ్చింది.
సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, ఐస్ క్రీం, హార్ట్ ఎటాక్, లవర్స్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, కేరింత లాంటి సినిమాల్లో నటించిన తేజస్వి ఆ తర్వాత బిగ్బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. తేజస్వి తల్లి చిన్నప్పుడే క్యాన్సర్ భారీన పడి చనిపోయింది. ఇక ఆమె తండ్రి ఆర్మీ ఆఫీసర్ అయినా విపరీతంగా మద్యానికి బానిస అయ్యాడు.
దీంతో ఆమె చిన్న వయస్సులోనే తినడానికి తిండి లేక పస్తులు ఉన్న రోజులు ఎన్నో ఉన్నాయట. ఆ సమయంలోనే ఆమె టీబీ భారీన పడితే ఆమెను హీరోయిన్ సమంత ఆదుకుందట. సమంత తనకు ఎంతో సాయం చేసిందని.. ఆమెకు ఎప్పటకీ రుణపడి ఉంటానని తేజస్వి చెపుతోంది. ఆ తర్వాత ఆమె క్రమక్రమంగా సినిమా అవకాశాలు సొంతం చేసుకుంది.