భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీ ఆ బాధ్యతల నుంచి తప్పుకోగానే వెంటనే కేఎల్. రాహుల్ భారత జట్టు కెప్టెన్‌గా రెడీగా ఉన్నాడని మాజీ టెస్టు ఓపెనర్, క్రికెట్ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఆకాశ్ తన సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్‌తో ముచ్చటించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ సారి ఐపీఎల్లో పంజాబ్ కెప్టెన్‌గా రాహుల్ తన టీంను ఎలా ? నడిపిస్తాడు ? ఎలా రాణిస్తాడో ? భవిష్యత్తులో భారత జట్టును కూడా అలాగే రాణిస్తాడని ఆకాశ్ తెలిపారు.
కోహ్లీ, రోహిత్ ఒకే వయసు కలవారని, ఒక స్థాయికి వచ్చేసరికి వారిద్దరూ కెప్టెన్లుగా కనిపించరని ఆకాశ్ చెప్పాడు. ధోనీ కోహ్లీకి ఎలా పగ్గాలు అప్పగించాడో ? కోహ్లీ కూడా తన సమయం అయిపోయాక మరొకరికి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించక తప్పదని.. అప్పుడు రాహుల్ కెప్టెన్సీ రేసులో ముందు వరుసలో ఉంటాడని ఆకాశ్ చెప్పాడు. రాహుల్ కెప్టెన్‌గా ఎలా పనికొస్తాడనే విషయం ఈ ఐపీఎల్‌తో తెలుస్తుందని చోప్రా అన్నాడు. ఇప్పటి వరకు ఉన్న రాహుల్ ఆటను చూస్తే అతడు భవిష్యత్తులో మంచి కెప్టెన్ అవుతాడనే అనిపిస్తోందన్నాడు.