సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్‌ను హత్య విషయంలో అనేక సందేహాలు వస్తున్నాయి. తాజాగా సుశాంత్ మాజీ ప్రియురాలు అంకితా లోఖాండే సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని ఓ ఆటాడుకుంది. తాను సుశాంత్‌ను చంపేశారని ఎప్పుడూ అనలేదని చెప్పిన అంకితా సుశాంత్‌కు న్యాయం జరగాని మాత్రమే కోరానని చెప్పింది. జస్టిస్ ఫర్ సుశాంత్’ అంటూ సోషల్‌మీడియా వేదికగా నిరసనలు వెలువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు రియాను సీబీఐ, నార్కోటిక్ అధికారులు విచారణ చేస్తున్నారు.
ఇక ఇది అనుకోకుండా జరిగింది కాదని.. చేసుకున్న కర్మ ఫలితం అని అంకితా ట్వీట్ చేసింది. ఇక తాను సుశాంత్ మానసిక స్థితి గురించి మాత్రమే మాట్లాడానని.. తాను సుశాంత్‌ను హత్య చేసినట్టు ఎప్పుడూ మాట్లాడలేదని చెప్పింది. సుశాంత్ ఆత్మహత్య చేసుకునే అంత పిరికివాడు కాదని.. తాను నిజం భయటకు రావాలని మాత్రమే పోరాడుతున్నానని చెప్పింది.
ఇక అంకితా రియాకు ఎన్నో ప్రశ్నలు సంధించింది. సుశాంత్ ఆరోగ్య పరిస్థితి తెలిసిన వాళ్లు అతడికి డాక్టర్ చెప్పిన మందులు కాకుండా డ్రగ్స్ తీసుకోవడానికి ప్రోత్సహిస్తారా ? అని చెప్పింది. సుశాంత్ అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అసలు ఎవరైనా అలా చేస్తారా? అని ప్రశ్నించారు. రియా సుశాంత్ డ్రగ్స్ వాడుతున్నట్లు అతడి కుటుంబ సభ్యులకు చెప్పలేదు.. పైగా తాను కూడా డ్రగ్స్‌ను తీసుకుంటూ ఆనందించింది. అందుకే నేను ఖర్మ తప్పదూ అంటూ పేర్కొన్నాను అని అంకిత తెలిపింది.