Sportsఈ సారి ఐపీఎల్ టైటిల్ విజేత ఎవ‌రంటే... బ్రెట్ లీ జోస్యం...

ఈ సారి ఐపీఎల్ టైటిల్ విజేత ఎవ‌రంటే… బ్రెట్ లీ జోస్యం ఇదే

గ‌త ఐపీఎల్లో ముంబై ఇండియ‌న్స్ ఫైన‌ల్లో టైటిల్ ఎగ‌రేసుకుపోయింది. చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జ‌రిగిన ఫైన‌ల్లో చివ‌రి ఓవ‌ర్లో ముంబైను ఓడించింది. దీంతో ముంబై ఖాతాలో నాలుగో టైటిల్ ప‌డ‌గా.. చెన్నై ఆశ‌ల‌కు చివ‌రి ఓవ‌ర్లో గండి ప‌డింది. అయితే ఈ సారి టైటిల్ ఎట్టి ప‌రిస్థితుల్లోనూ చెన్నైదే అని ఆసీస్‌ మాజీ పేసర్‌ బ్రెట్‌ లీ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్‌ కవరేజ్‌లో బ్రాడ్‌కాస్టర్స్‌ హోస్ట్‌గా చేయనున్న బ్రెట్‌ లీ.. ప్రస్తుతం ముంబైకు చేరుకుని ఐసోలేషన్‌లో ఉన్నాడు.

ఈ క్ర‌మంలోనే ప‌లువురు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు బ్రెట్ లీ స‌మాధానాలు ఇస్తూ ఈ సారి ఐపీఎల్ టైటిల్ ఎవ‌రు గెలుస్తార‌న్న ప్ర‌శ్న‌కు సమాధానం ఇస్తూ ఈ సారి ట‌ఫ్ ఫైట్ ఉంటుంద‌ని.. విజేతను చెప్పడం కష్టమే అయినా తాను మాత్రం సీఎస్‌కేనే టైటిల్‌ గెలుస్తుందని అనుకుంటున్నట్లు తెలిపాడు. ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ప్లేఆఫ్స్‌కు చేరుతుందని జోస్యం చెప్పాడు. ఈసారి ఫైనల్‌-4లో కేకేఆర్‌ కచ్చితంగా ఉంటుందన్నాడు. గతంలో కేకేఆర్‌, కింగ్స్‌ పంజాబ్‌ జట్ల తరఫున బ్రెట్‌ లీ ఆడాడు

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news