బిగ్‌బాస్‌లో ఎన్నో అంచనాలతో వెళ్లిన డైరెక్టర్ సూర్య కిరణ్ ఫస్ట్ వీక్‌లోనే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాడు. బయటకు వచ్చాక కొందరు మీడియా వాళ్లు ఆయన్ను వదలకపోవడంతో వాళ్లతో మాట్లాడిన సూర్య కిరణ్ బిగ్‌బాస్ ఇంటి గుట్టు విప్పేశాడు. తాను వాళ్లు ఇచ్చే రు. 50 లక్షల కోసం హౌస్‌లోకి రాలేదని చెప్పాడు. తాను సత్యం సినిమా హిట్ అయ్యాక హైదరాబాద్‌లోనే ఉన్నానని.. తర్వాత వ్యక్తిగత కారణాలతో చెన్నై వెళ్లిపోయానని చెప్పాడు. కొన్ని వెబ్సైట్లు తాను చనిపోయినట్టు వార్తలు రాయడం మాత్రం చాలా బాధాకరమని చెప్పాడు.
ఇక బిగ్‌బాస్ ఆఫర్ మంచిదే అని.. కనీసం నాలుగు వారాలు అయినా ఉంటానని అనుకున్నానని.. అయితే తొలి వారంలోనే ఎలిమినేట్ అయ్యానని చెప్పాడు. హౌస్‌లో అమ్మ రాజశేఖర్ తప్ప మిగిలిన వారు ఎవ్వరూ కూడా సినిమాలతో జనాల ఆదరణ పొందిన వారు కాదని.. అయితే వారు తమలో తాము పెద్ద సెలబ్రిటీల్లా ఫీల్ అవుతున్నారని.. వాళ్లకు నాలుగు మంచి విషయాలు చెప్పినా వినరని వాపోయాడు. తనకు ప్రతి రోజు భారంగా ఉండేదని.. కంటెస్టెంట్లు చాలా ఓవర్‌గా నటిస్తారని.. బిర్యానీ చూస్తేనే కొత్తగా ప్రవర్తిస్తారని.. వర్షం వస్తే అదో వింతలా ఫీలవుతారని చెప్పాడు.
ఇక హౌస్‌లోకి వచ్చిన వారంతా ముందుగా చాలా ప్రిపేర్ అయ్యారని.. ఇంతకు ముందు హౌస్‌లో ఉన్న వారిని కలిసి ఎక్కువ సేపు పాజిటివ్‌గా ఉండేందుకు ఏం చేయాలని ప్లాన్ చేసుకున్నారని… తాను అలా చేయలేదని సూర్య కిరణ్ చెప్పాడు. ఓవర్ యాక్షన్‌తో ఉంటేనే ఫుటేజ్‌కు కనిపిస్తారన్నది ప్రేక్షకులకు తెలుసు అని.. తాను అలా చేయకపోవడంతోనే త్వరగా బయటకు వచ్చానని సూర్యకిరణ్ బిగ్‌బాస్ అసలు గుట్టు ఘాటుగా విప్పేశాడు.