అసలు టాలీవుడ్లో ఉన్న కాస్టింక్ కౌచ్ అనే దానిని బయటకు తీసుకువచ్చిన ఘనత ఖచ్చితంగా శ్రీరెడ్డిదే అని చెప్పాలి. ఆమె కోకొల్లుగా ఇంటర్వూలు ఇవ్వడంతో పాటు ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది బాగోతాలను బయట పెట్టింది. ఆమె ఇటీవల ఇంటర్వ్యూలో ఇండస్ట్రీకే చెందిన ఓ నటి భర్త బాగోతం బయట పెట్టింది. కొద్ది రోజుల క్రితం ఓ మైనర్ బాలిక తన వద్దకు వచ్చి ఓ నటి నన్ను రు. 3 వేలకు బుక్ చేసుకుందని.. ఆమె దగ్గరుండి మరీ తన భర్త గదిలోకి పంపిందని.. ఆమె భర్త మాత్రలు వేసుకుని ఏకంగా మూడు గంటల పాటు తనను టార్చర్ పెట్టినట్టు ఆ మైనర్ బాలిక వాపోయిందని చెప్పింది.
ఇలాంటి సంఘటనల వల్లే తాను బజారుకెక్కి పోరాటాలు చేయాల్సి వచ్చిందని శ్రీరెడ్డి ఆవేదన వ్యక్తం చేసింది. అయితే శ్రీరెడ్డి అలా టార్చర్ పెట్టిన నటి, ఆమె భర్త పేరు మాత్రం బయట పెట్టలేదు. కొందరు మాత్రం ఇండస్ట్రీలో అవకాశాల పేరుతో మైనర్ బాలికలను, యువతులను మోసం చేసే ఇలాంటి వారి పేర్లు బయట పెట్టాలని కోరుతున్నారు.
ఇక శ్రీరెడ్డి పేరు చెప్పకపోయినా సోషల్ మీడియాలో దీనిపై డిస్కర్షన్ నడుస్తోంది. ఆమె చెప్పింది ఓ సీనియర్ నటీమణి.. ఆమె భర్త గురించే అని.. వీరిపై ఇప్పటికే ఇలాంటి ఆరోపణలు కూడా ఉన్నాయని ఇండస్ట్రీలో గుసగుసలు ఉన్నాయి.