రష్యా కరోనా టీకా స్పుత్నిక్ వ్యాక్సిన్ భత్రతపై అనేకానేక సందేహాలు ముసురుకున్నాయి. ఇక డోసులు తీసుకున్న ప్రతి ఒక్కరిలోనూ ఏడుగురిలో ఒకరికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని రష్యా ఆరోగ్యశాఖ చెప్పింది. మొదటి దశ ప్రయోగాల్లో మొత్తం 40 వేల మందికి డోసులు ఇవ్వాలని ప్లాన్ చేశారు. ఇప్పటి వరకు 300 మందికి వ్యాక్సిన్ వేస్తే వారిలో 14 శాతం మందికి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయంటున్నారు. ఈ డోసు తీసుకున్న వారిలో నీరసంతో పాటు కండరాల నొప్పి, జ్వరం వచ్చాయి.
మరో 21 రోజుల పాటు వారిని సంరక్షణలో ఉంచి. వారి ఆరోగ్య పరిస్థితి సమీక్షించి రెండో డోసు టీకా ఇస్తామని చెప్పారు. ఇక స్పుత్నీక్ వీ కరోనా వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలు పూర్తి కాకుండానే రష్యా ఈ వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ప్రపంచంలోనే మొదటి కోవిడ్ వ్యాక్సిన్ తేవాలన్న ఆతృతతోనే రష్యా ఈ అనుమతులు మంజూరు చేసిందన్న విమర్శలు కూడా వచ్చాయి.
ఇక ఇప్పటికే టీకా భద్రత, నాణ్యతపై పూర్తి స్థాయిలో పరిశోధనలు జరగకుండా మార్కెట్‌లోకి రిలీజ్ చేయడంపై ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు అనేక సందేహాలు వ్యక్తం చేశారు. ఇక డీజీసీఐ అనుమతులు రావాల్సిన నేపథ్యంలో సైడ్ ఎఫెక్ట్‌లు రావడం ఆందోళన కలిగిస్తోంది.