కరోనా లాక్‌డౌన్ వేళ సినిమాల్లో విలన్ రోల్స్ వేసుకునే సోనూసుద్ నిజమైన హీరో అయిపోయాడు. లాక్‌డౌన్ వేళ దేశం స్తంభించిపోతే సోను దేశవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది పేద కార్మికులను, వలస కూలీలను ఆదుకున్నాడు. ఇక వలస కూలీలు వారి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు బస్సులు ఏర్పాటు చేశారు. మరి కొంతమందికి స్పెషల్ ఫ్లైట్లు ఏర్పాటు చేసి మరీ వారు వారి స్వస్థలాలకు వెళ్లేలా చేశాడు. సోను బాలీవుడ్‌లోనే కాదు సౌత్ సినీ అభిమానులకు కూడా ఎంతో సుపరిచితమే.
దూకుడు, అరుంధతి, సూపర్, జులాయి లాంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు. సినిమాల్లో ఎక్కువుగా విలన్ క్యారెక్టర్లు వేసుకునే సోను లాక్‌డౌన్ తర్వాత ఇప్పుడు దేశవ్యాప్తంగా రియల్ హీరో అయిపోయాడు. ఇప్పుడు సోను గురించి తెలుసుకునేందుకు ప్రతి భారతీయుడు ఎంతో ఆసక్తితో ఉన్నాడు. ఇక సోనూకు తొలి సినిమా ఛాన్స్ ఎలా వచ్చిందన్నది చూస్తే ఆసక్తికరంగా అనిపిస్తుంది.
సోనూకు తొలి సినిమా ఛాన్స్ తమిళ్‌లో వచ్చింది. తమిళ్ ఛాన్స్ సోనుకు వచ్చిన వెంటనే సోనూ తల్లి తమిళ్ నేర్చుకునేందుకు ఓ పుస్తకం కూడా ఇచ్చిందట. తాను తొలి సినిమాకు ఎంపికైన క్షణాలను ఎప్పటకి మర్చిపోలేనని సోనూ చెప్పాడు. 1999లో ఖల్లంజాగర్ సినిమాతో తాను కోలీవుడ్‌లో ఫస్ట్ టైం ఎంట్రీ ఇచ్చానని సోనూ చెప్పాడు.