బిగ్‌బాస్ నాలుగో సీజన్ ఇప్పటికే పది రోజులు కంప్లీట్ అయ్యింది. ఇక ఇంట్లో పాటించాల్సిన నిబంధనల విషయంలో ఎవ్వరూ పెద్దగా పట్టించుకున్నట్టు లేదు. తెలుగు మాట్లాడాల్సిన కంటెస్టెంట్లు ఈ నిబంధనను పెద్దగా పట్టించుకున్నట్టు లేదు. కొందరు తెలుగుతో పాటు అన్ని భాషలు మిక్స్ చేసుకుని మాట్లాడేస్తున్నారు. ఈ నిబంధన పాటించనందుకు బిగ్‌బాస్ అందరికి కలిపి పనిష్మెంట్ ఇచ్చాడు. దీంతో నోయల్ హర్ట్ అయినట్టే కనిపిస్తోంది. మిగిలిన ఇంటి సభ్యులపై అసహనం వ్యక్తం చేయడంతో పాటు బిగ్‌బాస్ మీద కూడా ఫైర్ అయ్యాడు.
క్షమించండి బిగ్‌బాస్ ఇప్పటి నుంచి మేం తెలుగులోనే మాట్లాడుతాం అని నోయల్ బోర్డు మీద రాయడంతో పాటు తనకు బిగ్‌బాస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. ఇతర కంటెస్టెంట్లకు బస్తీమే సవాల్ అని ఛాలెంజ్ చేయడంతో పాటు ఈ శనివారం తాను హౌస్ నుంచి వెళ్లిపోతానని.. నాగార్జున సార్‌కు కూడా చెప్పేస్తానని నోయల్ కాస్త కోపంగా అన్నాడు.
అయితే హౌస్‌లో అభిజిత్, మోనాల్, అఖిల్ ఎక్కువుగా తెలుగు మాట్లాడడం లేదని.. అలాంటిది నోయల్‌కు ఎందుకు శిక్ష అంటూ కొందరు అభిమానులు ఫైర్ అవుతున్నారు. మరి కొందరు మాత్రం బిగ్‌బాస్ వచ్చి సారీ చెప్పాలని అనడం కరెక్ట్ కాదంటున్నారు.