అఖిల్ పెళ్లి ఫిక్స్ చేసిన స‌మంత‌…. అమ్మాయి ఎవ‌రంటే…!

టాలీవుడ్ మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్స్ అంద‌రూ ఒక్కొక్క‌రు పెళ్లి పీట‌లు ఎక్కేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల నిఖిల్, నితిన్, రానా పెళ్లి చేసుకొని బ్యాచిలర్ జీవితానికి ఫుల్‌స్టాప్ పెట్టారు. ఈ లిస్టులోనే మెగా ఫ్యామిలీ హీరోలు వ‌రుణ్ తేజ్‌, సాయిధ‌ర‌మ్ తేజ్ సైతం ఉన్నారు. ఇక ఇప్పుడు అక్కినేని న‌వ మ‌న్మ‌థుడు అక్కినేని అఖిల్ సైతం పెళ్లికి రెడీ అవుతోన్న‌ట్టు తెలుస్తోంది. వాస్త‌వానికి అఖిల్‌కు గ‌తంలోనే శ్రియా భూపాల్‌తో ఎంగేజ్మెంట్ అయ్యాక క్యాన్సిల్ అయిన సంగ‌తి తెలిసిందే.

Samantha praises Akhil Akkineni on singing in his next film directed by  Vikram K Kumar

ఆ త‌ర్వాత అఖిల్ అన్న చైతు, స‌మంత పెళ్లి జ‌రిగిపోయింది. ఇక తాజాగా అఖిల్ పెళ్లి ఓ ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త కుమార్తెతో ఫిక్స్ అయ్యింద‌ని అంటున్నారు. ఆంధ్రాకు చెందిన ఈ వ్యాపార‌వేత్త కుటుంబం హైద‌రాబాద్‌లో సెటిల్ అయ్యింద‌ని స‌మాచారం. ఈ పెళ్లి వెన‌క అఖిల్ వ‌దిన స‌మంత చ‌క్రం తిప్పింద‌ని తెలుస్తోంది. ఆమెనే ఇరు కుటుంబాలను మెప్పించి అఖిల్ పెళ్లి బాధ్యత భుజాలపై వేసుకుందని అంటున్నారు. పెళ్లి దాదాపు ఖ‌రారు అయ్యింద‌ని.. దీనిపై త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న కూడా రానుంద‌ని తెలుస్తోంది.

సమంత, చైతు సైలెంట్.. అక్కినేని ఇంట ఏం జరుగుతోంది ? | Samantha and Naga  chaitanya silent on Akhil's Birthday

ఇక ఎప్ప‌టి నుంచో నాగార్జున‌, అమ‌ల సైతం అఖిల్‌కు పెళ్లి చేసేయాల‌ని చూస్తున్నారు. ఇక అఖిల్ ప్ర‌స్తుతం బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్‌.

Leave a comment