ప్రపంచం అంతా కరోనా వైరస్ కారణంగా ఒక్కసారిగా స్తంభించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా దెబ్బతో కోటి మంది మరణిస్తారని లెక్కలు వేస్తున్నారు. కరోనాకు వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనాతో కలిసి జీవించక తప్పని పరిస్థితి వచ్చేసింది. ఎవరి జాగ్రత్తలో వాళ్లు ఉంటూనే కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే పనులు చేసుకోవాల్సి వస్తోంది. దీంతో ఇప్పుడు మన జీవితంతో మాస్క్‌లు, శానిటైజర్లు ఓ భాగం అయిపోయాయి. ప్రజలు, ప్రభుత్వాలు కూడా మాస్క్‌లు తప్పనసరి అని చెప్పేశాయి.
ఇక్కడి వరకు బాగానే ఉంది. మాస్క్ బయటక వెళ్లేటప్పుడు మాత్రమే కాదు.. చివరకు పడక గదిలో శృంగారం చేసేటప్పుడు కూడా పెట్టుకోవాలన్న కొత్త నిబందన తీసుకు వస్తున్నారు. ఈ విషయాన్ని కెనడాకు చెందిన ఛీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ థెరెసా టాం చెపుతున్నారు. శృంగారం సమయంలో ఇష్టమొచ్చినట్టు ముద్దులు పెట్టుకోవడం కూడా కొద్ది రోజుల పాటు మానుకోవాలని ఆమె సూచిస్తున్నారు.
ఇక శృంగారంలో వీలైనంత వరకు ముద్దులు పెట్టుకోవడం మానుకోవాలని.. మొహాలను దూరంగా ఉంచుకోవాలని కూడా ఆమె అంటున్నారు. కరోనా ప్రభావం వల్ల చాలా పరిమితులతో కూడిన శృంగారాన్ని ప్రస్తుతం ఎంజాయ్ చేయాలని.. ఇక కొత్త వారితో శృంగారం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ప్రమాదం అని ఆమె పేర్కొన్నారు.