గతంలో జెమినీ ఛానెల్లో వచ్చిన చిలసౌ స్రవంతి సూపర్ పాపులర్ అయ్యి అప్పట్లో టాప్ రేటింగులు కొల్లగొట్టింది. ఈ సీరియల్‌తోనే బుల్లితెరకు పరిచయం అయ్యింది నటి మీనాకుమారి. ఆమెను తెలుగు ప్రేక్షకులు ఎప్పటకీ మర్చిపోరు. మీనా కుమారి వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆమె ఏపీలోని గుంటూరు జిల్లాలో పుట్టింది. ఆమె తండ్రి ప్రభుత్వ ఉద్యోగి, తల్లి హౌస్ వైఫ్. చదువు పూర్తయ్యాక ఆమె తెలిసిన వారి ద్వారా సీరియల్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఈ క్రమంలోనే ఆమె సీరియల్స్‌లో పలు క్యారెక్టర్లతో పాపులర్ అయిన వాసుని పెళ్లాడింది. వాసు ఇప్పటకి సౌత్ ఇండియాలో అన్ని భాషల్లో వస్తోన్న సీరియల్స్‌లో హీరోగా చేస్తూనే ఉన్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మీనా కుమారి అటు సీరియల్స్‌తో పాటు ఇటు సినిమాల్లోనూ నటిస్తోంది. తెలుగులో మీనా కుమారి వెంకటేష్, నాగార్జున, ఎన్టీఆర్, మహేష్‌బాబు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఈ భార్య భర్తలు ఇద్దరు తమ జీవితంలో ఫుల్ బిజీగా ఉండడంతో పాటు బాగా సంపాదిస్తున్నారు.