ఒకప్పటి టాప్ యాంకర్ అనితా చౌదరి గురించి అందరికి తెలుసు. అప్పట్లో ఆమె యాంకర్‌గా చేయడంతో పాటు సీరియల్స్, సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు పొందారు. అమృతం, నాన్న లాంటి సీరియల్స్ కూడా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత అనిత ఉయ్యాలా జంపాలా సినిమాతో మళ్లీ వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చారు.
ఈటీవీలో ప్రసారం అయ్యే కస్తూరి సీరియల్‌తో నటిగా మళ్లీ బుల్లితెరపై తన ప్రస్థానం ప్రారంభించిన ఆమె ఏడు సంవత్సరాల పాటు ఆ సీరియల్లో లీడ్ రోల్ చేసి ఉత్తమ నటి అవార్డు కూడా అందుకున్నారు. ఇక ఆమె నటించిన రుతురాగాలు సీరియల్ కూడా సూపర్ హిట్ అయ్యింది. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన తాళి సినిమాలో ముందుగా ఆమెకే హీరోయిన్ అవకాశం వచ్చింది.
అయితే ఇంటికి దూరంగా ఆరు నెలల పాటు షూటింగ్ చేయాలని చెప్పడంతో ఆమె ఆ ఛాన్స్ వదులుకుంది. ఆ తర్వాత ఆమె ఓ ఎన్నారైను పెళ్లి చేసుకుని ఎంచక్కా ఫ్యామిలీ లైఫ్‌తో పాటు ఇటు కెరీర్‌ను కూడా ఎంజాయ్ చేస్తోంది. ఈ దంపతులకు ప్రస్తుతం ఒక బాబు.