Moviesనాగార్జున కంటే గంగ‌వ్వ ఎంత చిన్న‌దంటే... నాగ్‌ను భ‌లే ట్రోల్ చేస్తున్నారే..!

నాగార్జున కంటే గంగ‌వ్వ ఎంత చిన్న‌దంటే… నాగ్‌ను భ‌లే ట్రోల్ చేస్తున్నారే..!

టాలెండ్ ఉండాలే కాని వ‌య‌స్సుతో సంబంధం ఉండ‌దు అని ఫ్రూవ్ చేసింది యూట్యూబ‌ర్ గంగ‌వ్వ‌. ఇప్పుడు గంగ‌వ్వ ఏకంగా బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్ అయిపోవ‌డంతో పాటు తిరుగులేని ఫాలోయింగ్‌తో దూసుకుపోతోంది. ముస‌లావిడ కావ‌డంతో అంద‌రూ గంగ‌వ్వ‌ను గంగ‌వ్వ గంగ‌వ్వ అంటూ పిలుస్తున్నారు. అయితే ఆమె హోస్ట్ నాగార్జున కంటే రెండేళ్లు చిన్న‌దే అంట‌. ఇప్పుడు ఈ మ్యాట‌ర్ సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతోంది. ఈ విష‌యం తెలిసిన‌ప్ప‌టి నుంచి నెటిజ‌న్లు ఆమె వ‌య‌స్సు ఎంతో తెలుసుకునేందుకు తెగ సెర్చ్ చేస్తున్నారు.

Gangavva (Bigg Boss Telugu 4) Biography, Age, Height, Family, Movies

నాగార్జున ఆరు ప‌దుల వ‌య‌స్సుకు చేరువ అయినా కూడా ఇంకా కుర్రాడిలాగానే క‌నిపిస్తూ ఉంటాడు. గూగుల్ స‌మాచారం ప్ర‌కారం నాగార్జున వ‌య‌స్సు 61 సంవ‌త్స‌రాలు కాగా, గంగ‌వ్వ వ‌య‌స్సు 58 – 59 ఉంటుంద‌ట‌. దీంతో వీరిద్ద‌రి వ‌య‌స్సు కంపేరిజ‌న్ చేస్తూ కొంద‌రు మీమ్స్ క్రియేట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. 61 ఏళ్లు ఉన్న ముస‌లి నాగార్జున‌కు త‌న కంటే రెండేళ్లు చిన్న‌ది అయిన గంగ‌వ్వ ఎలా అవ్వ అవుతుంద‌ని సోష‌ల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news