ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మరోసారి ఉద్యోగులకు షాకివ్వనుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో అన్ని బ్యాంకులు ఖర్చులు తగ్గించుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎస్బీఐ తన రెండో విడత స్వచ్ఛంద పదవీ విరమణ పథకం ( వీఆర్ఎస్)ను అమలు చేసింది. ఇందులో భాగంగా మొత్తం 30,190 మంది ఉద్యోగులను ఇంటికి పంపించనుంది.
ఇప్పటికే వీఆర్ఎస్ కోసం రెడీ చేసిన నిబంధనలను బోర్డు అనుమతికి పంపారు.. ఆ అనుమతి వచ్చిన వెంటనే వీరందరు స్వచ్ఛందంగా పదవీ విరమణ తప్పదని అంటున్నారు. ఇక గతంలోనూ ఎస్బీఐ స్వచ్ఛంద పదవీ విరమణ పథకం అముల చేసిన సంగతి తెలిసిందే. ఇది ఎప్పటి నుంచో బ్యాంకులో పని చేస్తోన్న సీనియర్ ఉద్యోగులకు పెద్ద షాకే అనుకోవాలి.