అక్కినేని కోడలు సమంత ఈ యేడాది జాను సినిమాతో మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆమె ఏ సినిమ కూడా చేయడం లేదు. కొన్ని కథలు వింటున్నా ఆమె వేటికి ఓకే చెప్పలేదంటున్నారు. ఇదిలా ఉంటే ఆమె ఒకప్పటి సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు చెప్పిన ఓ కథకు ఓకే చెప్పిందని తెలుస్తోంది. ఆ కథ బెంగళూరు దేవదాసి నారత్తమ్మ కథ అని టాక్. ఈ సినిమాను తెరకెక్కించేందుకు కొద్ది రోజులుగా ప్రయత్నాలు చేస్తోన్న సింగీతం సమంత అయితేనే ఈ రోల్‌కు సెట్ అవుతుందని భావించి.. ఆమెను నాలుగైదు సార్లు కలిశాటర.
ముందు ఈ రోల్లో చేసేందుకు ఒప్పుకోని సమంత చివరకు సింగీతం పట్టుదలతో పాటు ఓ సీనియర్ డైరెక్టర్ కావడంతో మొమమాటానికి ఒప్పుకోక తప్పలేదంటున్నారు. సమంతతోనే ఈ సినిమా తీయాలని ఆయన పట్టుదలతో ఉండడంతో పాటు ఆమె చుట్టూ పదే పదే తిరుగుతుండడంతో ఆమె కాదనలేకపోయిందంటున్నారు. మొహమాటానికి ఒప్పుకున్నా కూడా తప్పకుండా సమంతకు ఇదో మంచి సినిమా అవుతుందనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు.
ఇక బెంగళూరు నాగరత్తమ్మ చరిత్ర చాలా గొప్పదని… ఆ పాత్రలో సమంత నటిస్తే ఆమె కెరీర్లోనే తప్పకుండా మరిచిపోలేని సినిమా అవుతుందని పలువురు భావిస్తున్నారు. ఏదేమైనా ఈ పాత్రతో సమంతకు మంచి పేరు వస్తుందనే అంటున్నారు.