సాయిపల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎక్కడో తమిళనాడు, కేరళ సరిహద్దుల్లోని ఓ మారుమూల గిరిజన పల్లెకు చెందిన సాయిపల్లవి వెండితెరపై ఎంట్రీ ఇచ్చి తన అందం, అభినయంతో సౌత్ ఇండియా సినీ ప్రేక్షకులు అందరిని ప్రతి సినిమాకు తన వైపునకు తిప్పేసుకుంటోంది. ఫిదా సినిమాతో అయితే తెలుగు ప్రేక్షకులు ఆమె నటనకు ఫిదా అయిపోయారు. ఇక ఆమె వ్యక్తిగత విషయానికి వస్తే ఆమె ఈటీవీలోని ఢీ ప్రోగ్రామ్ ద్వారా కంటెస్టెంట్‌గా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.
ఎప్పుడు అయితే మళయాళంలో ప్రేమమ్ హిట్ వచ్చిందో ఆ తర్వాత ఆమె సౌత్‌లో అన్ని భాషల్లోనూ పాపులర్ అయ్యారు. ఇక సాయి పల్లవికి ఓ అందమైన చెల్లి ఉంది. ఆమె పేరు పూజా కన్నన్. వీరిద్దరు చూడడానికి కవల పిల్లల్లా ఉంటారు. సాయి పల్లవి చెల్లి కావడంతో ఆమెకు కూడా పలు ఇండస్ట్రీల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. పూజ ఏ రైడ్ ఫర్ ఏ లవ్ సినిమాతో కోలీవుడ్లోకి అడుగు పెట్టింది.
పూజకు ఇప్పుడిప్పుడే మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇక తెలుగులోనూ ఆమెను కొందరు దర్శక నిర్మాతలు సంప్రదిస్తున్నారు. మరి పూజ తన అక్కలా స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదుగుతుందో ? లేదో ? చూడాలి.