ప్రపంచాన్ని వణికిస్తోన్న కోవిడ్ -19 కట్టడి విషయంలో ముందుగా రష్యా వ్యాక్సిన్ చెప్పి మరీ తయారు చేసింది. ఈ క్రమంలోనే కోవిడ్-19 కట్టడికి రష్యా తయారు చేసిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ మార్కెట్లో వచ్చేసింది. ఇది ప్రపంచానికే పెద్ద రిలీప్ లాంటి న్యూస్ అనే చెప్పాలి. ఇక రష్యా గమాలియా నేషనల్ రీసెర్చ్ ఆఫ్ ఎపిడిమాలజీ అండ్ మైక్రోబయాలజీ, రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్(ఆర్‌డీఐఎఫ్) సంయుక్తంగా ఈ వ్యాక్సిన్ రెడీ చేశాయి. ఇక ఇప్పటికే ఈ వ్యాక్సిన్ రష్యా ప్రజలకు అందుబాటులోకి వచ్చేసింది.
తొలి విడత డోసు టీకా తమ దేశ ప్రజలకు అందుబాటులో ఉందని కూడా ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇక రష్యా తన వ్యాక్సిన్‌ను భారత్‌లో కూడా రిలీజ్ చేసేందుకు రెడీగా ఉంది. అయితే మూడో దశ ప్రయోగాల తర్వాత మాత్రమే ఈ వ్యాక్సిన్‌ను రష్యా భారత్‌లో రిలీజ్ చేయనుంది.
ఇక రష్యా వ్యాక్సిన్‌ను మనదేశంలో రిలీజ్ చేసేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు వచ్చాయని కూడా నీతి అయోగ్ సభ్యుడు వి.కె. పాల్ వెల్లడించారు. ఈ ప్రతిపాదనల్ని మన దేశంలో పలు మెడికల్ కంపెనీలు పరిశీలిస్తున్నాయి. ఇప్పటికే సౌదీ అరేబియా, బ్రెజిల్, ఇండోనేసియా, ఫిలిప్‌పైన్స్ వంటి దేశాలు రష్యా టీకాకు అనుమతులు మంజూరు చేశాయి.