సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యా ఘటనలో మన టాలీవుడ్ లో కూడా గట్టిగా వినిపించిన పేరు రియా చక్రవర్తి. ఆమె తెలుగులో హ్యాపీ హ్యాపీగా సినిమాలో నటించింది. ఈ హత్య తర్వాత దాదాపు రెండు మూడు నెలలుగా రియా పేరు మీడియాలో వినిపిస్తూనే ఉంది. దీనికంటే కూడా ఆమె డ్రగ్ కేసు విషయంలో అరెస్టు అయిన ఘటన పెద్ద కలకలం రేపింది. ఇక ఈ కేసులో తీగ లాగుతోన్న కొద్ది డొంక కదులుతున్నట్టుగా అనేక ప్రముఖ హీరోయిన్లు, ఇతర నటులు పేర్లు కూడా బయటకు వస్తున్నాయి.
ఎన్సీబీ అధికారులకు రియా బాలీవుడ్‌లో డ్రగ్స్ వాడే పార్టీల పేర్లతో పాటు కొందరు హీరోయిన్లు, హీరోల పేర్లు కూడా చెప్పింది. టాలీవుడ్‌లో టాప్ హీరోల సరసన నటించిన రకుల్ ప్రీత్‌సింగ్, బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీఖాన్ కుమార్తె సారా ఆలీఖాన్ పేర్లు కూడా బయట పెట్టిందట రియా. ఇక రియా టాలీవుడ్‌లో నటించడంతో పాటు రకుల్ కూడా ఇక్కడ నటించడంతో ఇప్పుడు రకుల్‌కు సన్నిహితంగా ఉన్న ఓ టాప్ హీరో ( బడా ఫ్యామిలీ హీరో)తో పాటు మరి కొందరు హీరోయిన్లు కూడా ఈ ఉచ్చలో పడబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది.
ఇప్పటకీ పెళ్లి కాకుండా ఉన్న ఓ ముదురు ముద్దుగుమ్మ ( ప్రస్తుతం ఓ స్టార్ హీరో సినిమా హీరోయిన్)తో పాటు మరో ఇద్దరు యంగ్ హీరోల పేర్లు కూడా ఈ లిస్టులో ఉన్నాయంటున్నారు. ఏదేమైనా రియా లాగిన తీగ ఇంకా ఎంత మందిని కదిలిస్తుందో చూడాలి. ఈ పేర్లు బయటకు రావడంతో టాలీవుడ్‌లో పలువురు ఆందోళనలో ఉన్నారట.