Gossipsఆదిపురుష్‌లో సీత రోల్ కోసం ఇంట్ర‌స్టింగ్ బ‌జ్‌.. ఇద్ద‌రు అనుష్క‌లే...!

ఆదిపురుష్‌లో సీత రోల్ కోసం ఇంట్ర‌స్టింగ్ బ‌జ్‌.. ఇద్ద‌రు అనుష్క‌లే…!

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించనున్న ఆదిపురుష్ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్‌డేట్స్ బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఈ సినిమా ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ఆదిపురుష్‌ను భార‌త‌దేశ సినిమాకే త‌ల‌మానికంగా తెర‌కెక్కించే ప్లాన్ చేస్తున్నాడు. బాహుబ‌లినే మించేలా రు. 1000 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ సినిమాను టీ సీరిస్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. రామాయ‌ణంలో ఓ ఘ‌ట్టాన్ని ఆధారంగా చేసుకుని ఆదిపురుష్ తెర‌కెక్కిస్తున్నారు.

 

ఈ సినిమాలో ప్ర‌భాస్‌ది రాముడి పాత్ర కాగా సీత పాత్ర కోసం ప‌లువురు హీరోయిన్ల పేర్లు ప‌రిశీలిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. సీత పాత్ర ఎవ‌రు చేస్తార‌న్న‌ది ఇంకా స‌స్పెన్స్‌లోనే ఉంది. సీతాదేవి పాత్రకు మాత్రం అనేక పేర్లు వినిపిస్తున్నాయి. ముందు కీర్తి సురేష్ పేరు వినిపించింది. ఆ త‌ర్వాత కియారా అద్వానీ పేర్లు వినిపించాయి. ఇక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శ‌ర్మ, బాహుబ‌లి దేవ‌సేన అనుష్క పేర్లు ఇప్పుడు కొత్త‌గా వినిపిస్తున్నాయి.

 

అనుష్క శ‌ర్మ‌కు ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫాలోవ‌ర్స్ ఉన్నారు. పైగా స్టార్ బ్యాట్స్‌మెన్ కోహ్లీ భ‌ర్త కావ‌డంతో ఆమె అయితే నేష‌న‌ల్ వైడ్‌గా సినిమాకు ప్ల‌స్ అవుతుంద‌న్న‌ది ఓ ఆలోచ‌న అట‌. ఇక బాహుబ‌లి సినిమాతో అనుష్క ఎంత పాపుల‌ర్ అయ్యిందో తెలిసిందే. ఆమె దేవ‌సేన పాత్ర‌కు భార‌త్ మాత్ర‌మే కాదు ప్ర‌పంచ‌మే ఫిదా అయ్యింది. అందుకే ఈ ఇద్ద‌రిలో ఒక‌రి పేరును సీత రోల్ కోసం ప‌రిశీలిస్తున్నార‌ట‌. మరి ఈ ఇద్దరిలో ఎవరి పేరు ఖరారు అవుతుందో చూడాలి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news