Moviesప్రేమ‌లో ర‌ష్మిక‌.. క్లారిటీ వ‌చ్చేసింది..

ప్రేమ‌లో ర‌ష్మిక‌.. క్లారిటీ వ‌చ్చేసింది..

క్రేజీ హీరోయిన్ ర‌ష్మిక ఇప్పుడు తెలుగు, త‌మిళ్ భాష‌ల్లో వ‌రుస ఛాన్సుల‌తో దూసుకుపోతోంది. ప్ర‌స్తుతం తెలుగులో బ‌న్నీ ప‌క్క‌న పుష్ప సినిమాలో న‌టిస్తోన్న ర‌ష్మిక‌, కార్తీతో సుల్తాన్ సినిమా చేస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆమె ఇప్పుడు క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ్ భాష‌ల్లో క్రేజీ హీరోయిన్‌గా మారింది. ఈ క్ర‌మంలోనే ర‌ష్మిక ప్రేమ‌లో ప‌డిందంటూ కొద్ది రోజులుగా పుకార్లు, షికార్లు చేస్తున్నాయి. దీనిపై ఆమె స్పందించారు. ఓ అభిమాని ప్ర‌శ్న‌కు ర‌ష్మిక బదులు ఇస్తూ యస్‌ ఐయామ్‌ సింగిల్‌ అన్నారు.

Guess who impressed Rashmika Mandanna recently? | Kannada Movie News -  Times of India

ఇక తాను సింగిల్‌గా ఉండ‌డంలో ఉన్న ప్ల‌స్సులు, మైన‌స్‌లు విశ్లేషించి చెప్పిన ఆమె సింగిల్‌గా ఉండటం అనేది మన చాయిస్‌. మన కంపెనీని మనం బాగా ఎంజాయ్‌ చేయగలిగినప్పుడు ఇంకొకరు ఎందుకు ? అని ఆమె ఎదురు ప్ర‌శ్న వేసింది. సింగిల్ గా ఉంటూ ఎంజాయ్ చేయ‌గ‌లిగిన‌ప్పుడు… మ‌న‌కు కాబోయే ల‌వ‌ర్‌లో ఎలాంటి ల‌క్ష‌ణాలు ఉండాల‌నే అంశంపై మ‌నకు క్లారిటీ ఉంటుంద‌న్నారు.

Rashmika Mandanna (@RashmikaTFC) | Twitter

సింగిల్‌గా ఉండ‌డం వ‌ల్ల మైన‌స్ ఏంటంటే ఎవ‌రో ఒక‌రితో ప్రేమలో ప‌డిన‌ట్టు వార్తలు రాసేస్తార‌ని.. అందుకే తాను సింగిల్‌గా ఫుల్ హ్యాపీ… ర‌ష్మిక ప్రేమ‌లో ప‌డింద‌ని మాత్రం గాసిప్‌లు రాయ‌వ‌ద్ద‌ని సూచించింది. ప్ర‌స్తుతం ర‌ష్మిక సౌత్‌లో టాప్ హీరోయిన్‌గా తిరుగులేని క్రేజ్‌తో ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news