మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. సైరా, ఇప్పుడు ఆచార్య తర్వాత లూసీఫర్ రీమేక్, ఆ వెంటనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ఇలా వరుసగా క్రేజీ ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూ పోతున్నాడు. ఇక లూసీఫర్ రీమేక్‌కు ముందుగా సాహో డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తారని వార్తలు వచ్చాయి. అయితే సుజీత్ స్క్రిఫ్ట్ డవలప్ చేసినా అది చిరుకు నచ్చలేదు. ఇలా రెండుసార్లు సుజీత్‌కు ఛాన్స్ ఇచ్చిన చిరు ఆ తర్వాత కూడా సుజిత్ స్క్రిఫ్ట్ డవలప్ చేసిన తీరు తనకు నచ్చకపోవడంతో సుజీత్‌ను ఈ ప్రాజెక్టు నుంచి పక్కన పెట్టేశారంటున్నారు.
ఇక సుజీత్‌కు బదులుగా వినాయక్‌ను ఈ ప్రాజెక్టులోకి తీసుకోవాలని చిరంజీవి భావిస్తున్నట్టు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా రీమేక్ పనులు పూర్తయ్యాయి. ఈ సినిమాను కూడా చిరు తనయుడు చరణ్ నిర్మించే ఛాన్సులే ఉన్నాయి. మెగాస్టార్ సూచనలకు అనుగుణంగా దర్శకుడు వినాయక్ కథలో మార్పులు చేశాడంటున్నారు. ఇక లూసీఫర్ 2020 మధ్యలో సెట్స్ మీదకు వెళ్లే ఛాన్సులు ఉన్నాయి.
ఇక ఈ సినిమాలో చిరును ఢీ కొట్టే విలన్‌గా రానా దగ్గుబాటి నటిస్తున్నట్టు టాక్. రానాతో పాటు మరో యంగ్ హీరో నటిస్తున్నట్టు తెలుస్తోంది. బాహుబలి సినిమాలో భళ్లాలదేవుడిగా రానా ఎంత క్రూరమైన విలన్‌గా కనిపించాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్‌కు రానా విలన్ అంటే స్క్రీన్ షేక్ అవ్వడం ఖాయం. ఇక చిరు – వినాయక్ కాంబోలో ఠాగూర్, ఖైదీ నెంబర్ 150 సినిమాలు హిట్ అయ్యాయి. దీంతో ఇప్పుడు వారు హ్యాట్రిక్‌పై కన్నేశారు.