Moviesశ్రీముఖి కొత్త సినిమా ట్రైల‌ర్ .. హాట్ అందాలకు రెడీ కండి..!

శ్రీముఖి కొత్త సినిమా ట్రైల‌ర్ .. హాట్ అందాలకు రెడీ కండి..!

మ‌న తెలుగు బుల్లితెర యాంక‌ర్లు బుల్లితెర పాపులార్టీ కంటే వెండితెర మీద రొమాన్స్ చేసేందుకు కూడా రెడీ అవుతున్నారు. వెండితెర పాపులార్టీ కోసం వీరు ఎంత‌గా పాకులాడుతున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అన‌సూయ‌, శ్రీముఖి, రేష్మి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది క్రేజీ యాంక‌ర్లు వెండితెర పాపులార్టీ కోసం విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇక వీరిలో శ్రీముఖి తెలుగు బుల్లితెర‌పై ఎలాంటి క్రేజ్ ఉందో చెప్ప‌క్క‌ర్లేదు. బుల్లితెర‌పై హాట్ హాట్‌గా త‌న అంద‌చందాలు ఆర‌బోసే శ్రీముఖి బిగ్‌బాస్‌లోకి వెళ్లి అక్క‌డ కూడా గ‌ట్టి పోటీ ఇచ్చి టైటిల్ రేసులో చివ‌రి వ‌ర‌కు నిలిచింది.

ఇక ఈటీవీలో ప‌టాస్ షోతో శ్రీముఖి మ‌రింత‌గా పాపుల‌ర్ అయ్యింది. ఆ షోలో యాంక‌ర్ ర‌వితో ఆమె బుల్లితెర‌పై చేసిన రొమాన్స్‌కే తెలుగు ప్రేక్ష‌కులు ఓ రేంజ్‌లో ఫిదా అయిపోయేవారు. అందుకే ప‌టాస్ టీఆర్పీ రేటింగులు పేలిపోయాయి. ఇక శ్రీముఖి వెండితెర‌పై కూడా ఇప్ప‌టికే త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంది. కొన్ని సినిమాల్లో మెయిన్ రోల్స్‌లో కూడా ఆమె న‌టించినా ఆమెకు అనుకున్నంత గుర్తింపు రాలేదు.

లేటెస్ట్‌గా ఆమె మ‌రో సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈవీఎస్ గౌత‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే ఈ సినిమాకు ఇట్స్ టైమ్ టు పార్టీ అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది. సైబ‌ర్ క్రైం నేప‌థ్యంలో ఈ సినిమా క‌థాంశం ఉంటుందంటున్నారు. శ్రీముఖి హాట్ అందాలు ఈ సినిమాకు ప్ల‌స్ కానున్నాయ‌ట‌. ఈ సినిమాలో ఇత‌ర పాత్ర‌ల్లో మాయా నెల్లూరి, ధ్రుతి ప్రియ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి, సెప్టెంబ‌ర్ 11న సినిమాను రిలీజ్ చేయ‌నున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news