ఏపీ కేడర్ 2010కు చెందిన యువ ఐపీఎస్ కాటా ఆమ్రపాలికి రోజు రోజుకు సూపర్ క్రేజ్ వచ్చేస్తోంది. తెలంగాణలో ఇప్పటి వరకు పలు ప్రాంతాలకు కలెక్టర్‌గా పనిచేసిన ఆమె ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శిగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ క్రమంలోనే ఆమెకు మరో అరుదైన అవకాశం లభించింది. ఆమె తాజాగా ప్రధాని కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా నియమితులు అయ్యారు. తాజాగా పీఎంవోలో నియమితులు అయిన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు.
2023 అక్టోబర్ 27 వరకు ఆమె ఈ పదవిలో ఉంటారు. ఇక పీఎంవోలోకి కొత్తగా వచ్చిన ఐఏఎస్‌లలో మధ్యప్రదేశ్ 2004 కేడర్‌కి చెందిన రఘురాజ్ రాజేంద్రన్, ఉత్తరాఖండ్ 2012 కేడర్‌కి చెందిన మంగేష్ గిల్దియాల్ కూడా ఉన్నారు. ఆమ్రపాలి విషయానికి వస్తే విశాఖలో పుట్టిన ఆమె చెన్నై ఐఐటీ నుంచి పట్టాపుచ్చుకున్నారు.. అనంతరం ఐఐఎం బెంగళూరులో ఎంబీఏ పూర్తి చేసి 2010 యూపీఎస్సీ పరీక్షల్లో జాతీయ స్థాయిలో 39వ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. అతి తక్కువ సమయంలోనే ఆమె సూపర్ పాపులర్ అయ్యారనే చెప్పాలి.