Gossipsఆదిపురుష్ మూవీలో కృష్ణంరాజు రోల్ ఇదే..!

ఆదిపురుష్ మూవీలో కృష్ణంరాజు రోల్ ఇదే..!

బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ హీరోగా తెర‌కెక్కుతోన్న సినిమా ఆదిపురుష్‌. రామాయ‌ణంలోని ఓ ఘ‌ట్టం ఆధారంగా ఆదిపురుష్ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. రాముడిగా ప్ర‌భాస్ న‌టిస్తుండ‌గా… ప్ర‌తినాయ‌కుడు లంకేశ్ రోల్లో బాలీవుడ్ క్రేజీ హీరో సైఫ్ ఆలీఖాన్ న‌టిస్తున్నాడు. ఇక సీత పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శ‌ర్మ‌, స్విటీ బ్యూటీ అనుష్క‌, కైరా అద్వానీ పేర్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఆదిపురుష్‌కు సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

Down the memory lane with Krishnam Raju

ఈ సినిమాలో ప్ర‌భాస్ పెద‌నాన్న రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌. గ‌తంలో ప్ర‌భాస్ – కృష్ణంరాజు క‌లిసి బిల్లా, రెబ‌ల్ సినిమాల్లో న‌టించాడు. వీటిలో బిల్లా హిట్ అవ్వ‌గా, రెబ‌ల్ ప్లాప్ అయ్యింది. ఇప్పుడు మ‌రోసారి వీరిద్ద‌రు క‌లిసి పాన్ ఇండియా సినిమాలో న‌టిస్తుండ‌డం నిజ‌మైతే అది సూప‌ర్ కాంబినేష‌నే అవుతోంది. ఇప్ప‌టికే ప‌లువురు క్రేజీ స్టార్ల‌తో ఈ సినిమాకు నేష‌న‌ల్ క్రేజ్ వ‌చ్చేసింది.

U.V.Krishnam Raju (@UVKrishnamRaju) | Twitter

ఇక ఇప్పుడు కృష్ణంరాజు ఉంటే తెలుగులో ఈ సినిమాకు మ‌రింత ప్ల‌స్ అవ్వ‌డం ఖాయం. దాదాపు రు. 700 – 800 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కే ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేందుకు మరో మూడున్న‌రేళ్లు ప‌ట్టే ఛాన్సులు ఉన్నాయి. ప్ర‌భాస్ వ‌రుస‌గా పాన్ ఇండియా ప్రాజెక్టుల‌తో సంచ‌ల‌నాలు రేపుతున్నాడ‌నే చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news