డైరెక్టర్, బిగ్‌బాస్ కంటెస్టెంట్ నూతన్ నాయుడు మరో ఉచ్చులో చిక్కుకున్నాడు. ఇప్పటికే దళిత యువకుడు శ్రీకాంత్‌కు శిరోముండనం చేయించిన కేసులో నూతన్ నాయుడు భార్య, కుటుంబ సభ్యులు వీడియోతో సహా దొరికిపోయారు. ఈ కేసు ఇలా ఉండగానే తన మధుప్రియను భార్యను కేసు నుంచి తప్పించడానికి సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవి రమేష్ పేరిట నూతన్ నాయుడు పలువురు అధికారులకు ఫోన్‌చేసి మోసగించినట్టు కూడా పోలీసుల విచారణలో వెల్లడైంది.
ఇక శిరోముండనం చేయించేముందు కూడా నూతన్ నాయుడు తన భార్య మధుప్రియతో వీడియో కాల్ మాట్లాడినట్టు కూడా తేలింది. ఈ కేసు నమోదు అయిన 24 గంటల్లోనే పోలీసులు నూతన్ నాయుడు భార్య మధుప్రియతో సహా ఏడుగురును అరెస్టు చేశారు. ఇక శ్రీకాంత్‌పై దాడిచేసిన నిందితులు వాటిని వీడియోలు తీసి పైశాచిక ఆనందం పొందారట. ఇక కేసు నమోదు అయినప్పటి నుంచి పరారీలో ఉన్న నూతన్ నాయుడును పోలీసులు కర్నాకటలోని ఉడిపిలో అదుపులోకి తీసుకున్నారు.
ముంబైకి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసులకు పట్టుబడ్డాడని విశాఖ సీపీ మనీష్‌కుమార్ సిన్హా వెల్లడించారు. శిరోముండనం కేసులో నూతన్ నాయుడు పాత్ర ఉందని తేలిన తరువాతనే అతన్ని అరెస్ట్ చేశామన్నారు. ఇక ఈ శిరోముండనం ప్రధాన సూత్రధారి నూతన్ నాయుడు భార్య మధుప్రియే అని ప్రాథమిక విచారణలో తేలింది.