దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమాకు కరోనా లాక్‌డౌల్ల వల్ల బ్రేక్ పడింది. ఇక చరణ్ అల్లూరి సీతారామరాజు లుక్‌కు సంబంధించి టీజర్ ఇప్పటికే రిలీజ్ అయ్యింది. కరోనా వల్ల ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో మాత్రం రిలీజ్ చేయలేదు. లాక్ డౌన్ వల్లే ఎన్టీఆర్ టీజర్ రాలేదని ఎప్పటికప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు సర్దిచెపుతూ వస్తున్నాడు రాజమౌళి. ఓ వైపు స్టార్ హీరోలంతా షూటింగ్‌లకు రెడీ అవుతున్నా ఇంకా రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ఊసే ఎత్తడం లేదు. మరో రెండు మూడు నెలల వరకు షూటింగ్ లేకపోవచ్చనే అంటున్నాడు.
ఇదిలా ఉంటే తాజాగా ఓటీటీలో రిలీజ్ అయిన నాని వీ సినిమాను రాజమౌళి, కీరవాణి కుటుంబాలు కలిసి రాజమౌళి ఫామ్‌హౌస్‌లో చూశాయి. ఈ ఫొటోను రాజమౌళి తనయుడు కార్తీకేయ ట్విట్టర్‌లో ఫొటో పోస్ట్ చేయడంతో చాలా మంది సినీ అభిమానులు గుడ్, నైస్ అంటూ కామెంట్లు పెట్టినా ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో కొందరు మాత్రం ఆపుకోలేకపోయారు. ఈ వీ సినిమా గురించి మాకెందుకు ఆర్ ఆర్ ఆర్ నుంచి ఎన్టీఆర్ కొమరం భీం టీజర్ ఎప్పుడు వస్తుందంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు.
హీరోలంతా సెట్స్ మీదకు వస్తుంటే మీరు ఎప్పుడు ఆర్ ఆర్ ఆర్‌ను తిరిగి సెట్స్ మీదకు తీసుకు వస్తారని ప్రశ్నిస్తున్నారు. సరే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోపం ఎలా ఉన్నా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాజమౌళి కూడా చేసేదేం లేదు. ఆర్ ఆర్ ఆర్ భారీ బడ్జెట్ సినిమా. షూటింగ్ ప్రారంభం కావాలంటే కనీసం 500 మంది షూటింగ్లో ఉండాలి.. అందుకు ముందు పర్మిషన్లు రావాలి… అప్పుడు కాని షూటింగ్ ప్రారంభం కాదు.. అప్పుడు కాని కొమరం భీం టీజర్ రాదు.. అప్పటి వరకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ సహనంతో ఉండాల్సిందే..!