Moviesహ‌రికృష్ణ జ‌యంతి... ఎన్టీఆర్ పోస్టు గుండెలు పిండేసిందే..

హ‌రికృష్ణ జ‌యంతి… ఎన్టీఆర్ పోస్టు గుండెలు పిండేసిందే..

దివంగ‌త మాజీ మంత్రి, చైత‌న్య ర‌థ‌సార‌థి నంద‌మూరి హ‌రికృష్ణ 64వ జ‌యంతి నేడు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఆయ‌న అభిమానుల‌తో పాటు సినీ అభిమానులు, తెలుగుదేశం, నంద‌మూరి అభిమానులు జ‌రుపుకుంటున్నారు. బోళా మ‌నిషి అయిన హ‌రికృష్ణ తండ్రి బాట‌లోనే ఎప్పుడూ క్ర‌మ‌శిక్ష‌ణ త‌ప్ప‌కుండా న‌డిచేవారు. ముక్కుసూటి త‌నానికి మారు పేరు అయిన హ‌రికృష్ణ మూడు సంవ‌త్స‌రాల క్రితం న‌ల్లగొండ జిల్లాలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందారు.

ఇక హ‌రికృష్ణ త‌న అభిమానుల‌కు చివ‌రి సారిగా రాసిన లేఖ‌లో త‌న పుట్టిన రోజు వేడుక‌ల‌కు అభిమానులు దూరంగా ఉండాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఇదిలా ఉంటే తండ్రి జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న త‌న‌యుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ త‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎమోష‌న‌ల్ అయ్యారు. తండ్రితో ఉన్న అనుబంధం గుర్తు చేసుకుంటూ ఈ అస్థిత్వం మీరు, ఈ వ్య‌క్తిత్వం మీరు, మొక్కోవ‌ని ధైర్యంతో కొన‌సాగే ఈ ప్ర‌స్థానానికి నేతృత్వం మీరు, ఆ జ‌న్మాంతం త‌ల‌చుకునే అశృక‌ణం మీరే అంటూ తార‌క్ ట్వీట్ చేశాడు.

తార‌క్ పోస్టులోనే తండ్రిని గుర్తు చేసుకుని ఎంత ఎమోష‌న‌ల్ అయ్యాడో తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ సోద‌రుడు నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ సైతం త‌న తండ్రిని గుర్తు చేసుకుంటూ ఐ మిస్ యూ నాన్న అని పేర్కొన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news