Moviesప‌వ‌ర్‌స్టార్‌కు మ‌హేష్ బ‌ర్త్ డే విషెస్‌... చిన్న గిఫ్ట్ కూడా ఇచ్చాడే..

ప‌వ‌ర్‌స్టార్‌కు మ‌హేష్ బ‌ర్త్ డే విషెస్‌… చిన్న గిఫ్ట్ కూడా ఇచ్చాడే..

బుధ‌వారం ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా సినిమా, రాజ‌కీయ రంగాల‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు ప‌వ‌న్‌కు బ‌ర్త్ డే విషెస్ తెలియ‌జేస్తున్నారు. టాలీవుడ్ సినిమా హీరోలు అంద‌రూ ప‌వ‌న్‌కు బ‌ర్త్ డే విషెస్ చెపుతూ ప‌వ‌న్‌తో త‌మ‌కు ఉన్న అనుబంధం గుర్తు చేసుకునే స్టిల్స్ కూడా సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ కూడా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు బ‌ర్త్ డే విషెష్‌ను అంద‌జేశారు. ‘పవన్‌క‌ల్యాణ్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు. నీ ద‌యాగుణం, విన‌యం స్ఫూర్తిస్తుంటాయి. ఈ సంద‌ర్భంగా మీకు సంతోషం, ఆరోగ్యం క‌ల‌గాల‌ని కోరుకుంటున్నాను’ అంటూ మ‌హేశ్ ట్వీట్ చేశారు. ట్వీట్‌తో పాటు గ‌తంలో తాను ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో దిగిన ఫొటోను కూడా ట్వీట్ చేశాడు.

ఇప్పుడు  ఫొటోను ప‌వ‌న్ ఫ్యాన్స్ జోరుగా వైర‌ల్ చేస్తున్నారు. త‌మ అభిమాన హీరోను విష్ చేసిన సూప‌ర్ స్టార్‌కు కృత‌జ్ఞ‌త‌లు చెప్ప‌డంతో పాటు మీరు ఇద్ద‌రు క‌లిసే మ‌ల్టీస్టార‌ర్ కోసం వెయిట్ చేస్తున్నాం అంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

https://twitter.com/urstrulyMahesh/status/1301025890558603264?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1301025890558603264%7Ctwgr%5E&ref_url=https%3A%2F%2Fwww.andhrajyothy.com%2Ftelugunews%2Fmahesh-birthday-wishes-to-pawan-2020090211213312

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news