ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 విలయతాండవం చేస్తోంది. అయితే కోవిడ్ జాడ లేని ప్రపంచాన్ని, ప్రాంతాన్ని మనం ఇప్పట్లో ఊహించే పరిస్థితి లేదు. అయితే ఓ ప్రాంతంలో మాత్రం కోవిడ్ జాడే లేదు. అదే అంటార్కిటికా. వెయ్యి మంది శాస్త్రవేత్తలు, సిబ్బంది కొద్ది నెలలుగా అక్కడే ఉంటున్నారు. వారు కొద్ది నెలుగా చీకట్లోనే గడిపి ఇటీవలే సూర్య కిరణాల వెలుగు చూశారు. అయితే సోమవారం అక్కడికి కొంతమంది శాస్తవేత్తలు చేరుకుంటున్నారు.
కరోనాకు ముందు ప్రపంచంలోని ప్రజలు వారికిష్టమైనట్టుగా స్వేచ్ఛగా ఉంటే అంటార్కిటికాలో మాత్రం సుదీర్ఘ ఐసొలేషన్, ఆత్మవిశ్వాసం, మానసిక ఒత్తిడితో ఉండేవారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యిందని టేలర్ అనే శాస్త్రవేత్త తెలిపారు. కొవిడ్ భారీన పడకుండా ఎలా ఉండాలి ? అని అంశంపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తమకు పూర్తి అవగాహన లేదన్నారు. అయితే కొద్ది రోజుల్లో అక్కడికి వచ్చే శాస్త్రవేత్తల బృందం నుంచి తాము ఆ విషయాలు నేర్చుకుంటామని వారు తెలిపారు.
మంచు ఎక్కువుగా ఉండే ఇలాంటి ప్రదేశాల్లో కరోనా శరవేగంగా విస్తరిస్తుంది. పైగా ఇక్కడ కోవిడ్‌కు వైద్యం చేయడం చాలా కష్టం. అందుకే ఇక్కడ మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడికి చేరుకోవాల్సిన బృందాలు క్వారంటైన్ ముగించుకొని ఆగస్టు ప్రారంభంలోనే బయలుదేరాల్సి ఉండగా వాతావరణం సరిగా లేకపోవడంతో ఆలస్యం అయ్యింది.