బిగ్‌బాస్ 4 తెలుగు సీజన్లో ఉన్న ఒకే ఒక హీరోయిన్ మోనాల్ గజ్జర్. ఆమె తెలుగులో అల్లరి నరేష్ మూవీ సుడిగాడుతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత వెన్నెల 1 1/2, ఒక కాలేజీ స్టోరీ, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి సినిమాల్లోనూ మెరిసింది. అయితే ఆమెను మన ప్రేక్షకులు పెద్దగా గుర్తుంచుకోలేదు. ఆమె వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆమె స్వస్థలం గుజరాత్. ఆమె అహ్మదాబాద్‌లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది. మిస్ గుజరాత్‌నూ ఎంపికైంది.
ఇక ఆమెది సాధారణ కుటుంబం. ఆమె తండ్రికి ఆరోగ్యం విషమించినప్పుడు వైద్యం చేయించేందుకు డబ్బులు కూడా లేని పరిస్థితి. కేవలం రు. 750 మాత్రమే చేతిలో ఉంచుకుని సరైన వైద్యం చేయించుకోలేక తండ్రిని కోల్పోయానని ఆమె బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చేముందు ఎమోషనల్ అయ్యింది. ఇక తనకు అన్నీ అమ్మే అని చెప్పిన ఆమె లోపలకు వెళ్లాక దర్శకుడు సూర్యకిరణ్‌తో కూడా తన ఫ్యామిలీ గురించి చెప్పుకుని ఎమోషనల్ అవ్వడంతో కన్నీళ్లు వచ్చాయి.
ఇక హౌస్‌లోకి వెళ్లిన వెంటనే మొత్తం కలియ తిరిగి సందడి చేసిన మెనాల్ గజ్జర్.. ఆతర్వాత అమ్మను మిస్ అవుతున్న అని ఏడ్చేసింది. అలాగే తన తర్వాత వచ్చిన కంటెస్టంట్లకి తాగేందుకు మంచి నీళ్లు ఇచ్చి.. మార్కులు కొట్టేసింది. ఈ ఎమోషన్.. మంచితనం మోనాల్‌ని ఎప్పటివరకు బిగ్‌బాస్‌లో కొనసాగిస్తాయో చూడాలి.