టాలీవుడ్లో రోజా ప్రస్థానం నేటికి మూడు దశాబ్దాలుగా కొనసాగుతోంది. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రోజా తర్వాత కేరెక్టర్ ఆర్టిస్టుగానే కాకుండా, అటు వెండితెరపై, ఇటు బుల్లితెరపై బిజీ బిజీ. ఇక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి రెండుసార్లు ఎమ్మెల్యే అవ్వడంతో పాటు ప్రస్తుతం ఎమ్మెల్యేగాను ఏపీఐఐసీ చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నారు. రోజా రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా ఆమె జబర్దస్త్ షోలో మరింత బిజీగా ఉంటూనే ఉంటారు. ఇక ఆమె సినిమాలు ఇక్కడ తెలుగులోనే కాకుండా కోలీవుడ్లోనూ హిట్ అయ్యాయి.
ఈ క్రమంలోనే ఆమె తమిళ్ డైరెక్టర్ సెల్వమణిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. రోజా కుమారుడు పేరు కృష్ణ, కుమార్తె పేరు అన్షు మాలిక. ఇటీవలే అన్షు తన తల్లిదండ్రులతో కలిసి తన 17వ పుట్టిన రోజు జరుపుకుంది. ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ కావడంతో అవి చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. హీరోయిన్లను మించిన అందం అన్షు సొంతం.
అన్షు హీరోయిన్గా ఎంట్రీ ఇస్తే తప్పకుండా తక్కువ టైంలోనే తల్లిని మించిన స్టార్ హీరోయిన్ అవుతుందని పలువురు కామెంట్లు పెడుతున్నారు. రోజా మాత్రం తన పిల్లల అభిరుచిలను బట్టి ఆమెకు ఏ రంగంతో ఆసక్తి ఉంటే ఆ రంగంలోనే ప్రోత్సహించాలని భావిస్తోందట. మరి అన్షు సినిమాల్లోకి వస్తుందా ? రాదా ? అన్నది చూడాలి.