Gossipsత‌న హిట్ డైరెక్ట‌ర్‌తో మ‌రో సినిమాకు ఓకే చెప్పిన తార‌క్‌..!

త‌న హిట్ డైరెక్ట‌ర్‌తో మ‌రో సినిమాకు ఓకే చెప్పిన తార‌క్‌..!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ ఇప్పుడు కెరీర్‌లో ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. టెంప‌ర్ సినిమా నుంచి తార‌క్‌‌కు ప్లాప్ అన్న‌ది లేదు. ఐదు వ‌రుస హిట్ల‌తో సూప‌ర్ ఫామ్‌లో ఉన్న తార‌క్‌ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంట‌నే తార‌క్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించే సినిమాలో న‌టిస్తాడు. ఆ వెంట‌నే వ‌రుస పెట్టి క్రేజీ ప్రాజెక్టుల‌ను లైన్లో పెడుతున్నాడు.

After Rajamouli, now Koratala Siva for Jr NTR - tollywood

కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించే సినిమాతో పాటు వ‌రుస‌గా క‌థ‌లు విని ఓకే చేస్తున్నాడు. వ‌చ్చే మూడు నాలుగేళ్లు ఖాళీ లేకుండా సినిమాలు చేసేందుకు తార‌క్‌ ప్లానింగ్‌తో వెళుతున్నాడు. ఈ క్ర‌మంలోనే కొర‌టాల శివ‌తో మ‌రోసారి సినిమా చేసేందుకు తార‌క్ రెడీ అవుతున్నాడ‌ట‌. గ‌తంలో వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన జ‌న‌తా గ్యారేజ్ సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది. కొర‌టాల ప్ర‌స్తుతం చిరుతో చేసే ఆచార్య త‌ర్వాత అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేస్తాడు.

I am indebted to Koratala Siva throughout my life : NTR

ఆ వెంట‌నే కొరటాల – తార‌క్ ప్రాజెక్టు ఉంటుంద‌ట‌. ఈ సినిమాను కూడా మైత్రీ మూవీస్ వాళ్లు నిర్మిస్తార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ చేసే ఆర్ ఆర్ ఆర్, త్రివిక్ర‌మ్ సినిమాల త‌ర్వాత ఈ ప్రాజెక్టు ఉంటుందా ? లేదా ? కేజీఎఫ్ ప్ర‌శాంత్ నీల్ సినిమా త‌ర్వాత ఉంటుందా ? అన్న‌ది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news