Moviesబ‌చ్చ‌న్ ఫ్యామిలీలో క‌ల‌త‌లు ఇలా బ‌య‌ట ప‌డ్డాయా..!

బ‌చ్చ‌న్ ఫ్యామిలీలో క‌ల‌త‌లు ఇలా బ‌య‌ట ప‌డ్డాయా..!

అమితాబ్ బ‌చ్చ‌న్ ఫ్యామిలీలో క‌ల‌త‌లు ఉన్నాయని.. అత్త జ‌యాబ‌చ్చ‌న్‌కు, కోడలు ఐశ్వ‌ర్యారాయ్‌కు ప‌డ‌డం లేద‌న్న వార్త‌లు ఎప్ప‌టి నుంచో ఉన్నాయి. అయితే వీటిపై వారు ఎప్పుడూ స్పందించ‌లేదు కాని.. వారి ప‌ని వారు చేసుకుపోతున్నారు. ఇదిలా ఉంటే ఈ కుటుంబంలో నిజంగా క‌ల‌త‌లు ఉన్నాయో లేదో గాని స‌ర‌దాగా అమితాబ్ చెప్పిన ఓ సీక్రెట్‌తో అత్త‌కు, కోడ‌లికి ఏదైనా గ్యాప్ ఉందా ? అన్న సందేహం రాక‌మాన‌దు.

అమితాబ్ ఫ్యామిలీ అంతా క‌రోనాకు గురైన సంగ‌తి తెలిసిందే. ఈ స‌మ‌యంలోనే ఈ టెన్ష‌న్ నుంచి కాస్త రిలీఫ్ అయ్యేందుకు బచ్చన్ ఫ్యామిలీ మెంబర్స్ కోసం ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారట. ఈ గ్రూప్‌లో అంద‌రూ ఉన్నార‌ట‌. ఈ విష‌యాన్ని అభిషేక్ కాఫీ విత్ క‌ర‌ణ్ షోలో బ‌య‌ట పెట్టారు. ఈ గ్రూపులో అంద‌రికంటే ముందుగా స్పందిచేది అమితాబ్ బచ్చన్ అట. భార్య ఐశ్వ‌ర్య చాలా లేట్‌గా స్పందిస్తుంద‌ని అస‌లు సీక్రెట్ చెప్పాడు.

ఇక త‌ల్లి జ‌య గురించి మాట్లాడుతూ గ్రూప్‌లో గుడ్ మార్నింగ్‌, గుడ్ నైట్ మెసేజ్‌లు పెట్ట‌డంలో మ‌మ్మీయే ఫ‌స్ట్ అని చెప్పాడు. ఇక ఈ గ్రూపులో ఎవ‌రు ఎక్క‌డికి వెళుతున్నారు ?  ఎప్పుడు వ‌స్తారు ? అనే విష‌యం కూడా మెసేజ్ చేయాల‌న్న నియ‌మం పెట్టుకున్నార‌ట‌. ఏదేమైనా గ్రూప్‌లో ఎవ‌రెలా స్పందిస్తారో ?  అభిషేక్ చెప్పిన తీరును బ‌ట్టి జ‌య‌, ఐశ్వ‌ర్య మ‌ధ్య ఇంత తేడా ఉందా ? అనిపించ‌క‌మాన‌దు. ఇక అభిషేక్ త‌న త‌ల్లిపై ఉన్న ప్రేమ‌ను బ‌య‌ట పెట్టుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news