Moviesహాట్ టీజ‌ర్‌తో కియారా ఏం మ‌త్తెక్కిస్తోందిలే...

హాట్ టీజ‌ర్‌తో కియారా ఏం మ‌త్తెక్కిస్తోందిలే…

కియారా అద్వానీని మామూలు అందంతో చూస్తేనే చూపులు తిప్పుకోలేం. అలాంటిది ఆమె త‌న హాట్ హాట్ అందాలు ఆర‌బోస్తూ ఉంటే ఇక క‌న్నార‌ప్ప‌గ‌ల‌మా ?  చెప్పండి. ఆమె నుంచి తాజాగా వ‌చ్చిన ఓ హాట్ టీజ‌ర్ ఇప్పుడు దుమ్ము రేపుతోంది. కియారా అద్వానీ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న తాజా సినిమా ఇందూ కీ జవానీ. తాజాగా ఈ సినిమా టీజ‌ర్ ఇన్ స్టా వేదికగా పంచుకుంది కియారా. బెంగాల్ ద‌ర్శ‌కుడు అబీర్ సేన్ గుప్తా తెర‌కెక్కిస్తోన్న ఈ సినిమా ప్ర‌స్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఆన్‌లైన్ డేటింగ్ యాప్ ల‌వ్ స్టోరీ నేప‌థ్యంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

ఇక క‌బీర్‌సింగ్ సినిమాతో కియారా దేశ‌వ్యాప్తంగా ప్ర‌శంస‌లు సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు తెలుగుతో పాటు హిందీ సినిమాల్ల న‌టిస్తూ బిజీబిజీగా ఉంటోంది. ఈ క్ర‌మంలోనే కియారా తెలుగులో మూడు సూప‌ర్ ఛాన్సులు ద‌క్కించుకుంద‌ని టాక్‌. మ‌హేష్‌బాబు సినిమాతో పాటు జూనియ‌ర్ ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్‌, నాగ్ అశ్విన్ – ప్ర‌భాస్ సినిమాల్లో ఆమె పేరు ప‌రిశీలిస్తున్నారు.

ఇక రామ్‌చ‌ర‌ణ్ కూడా ఆమెకు త‌న సినిమాలో ఛాన్స్ ఇవ్వాల‌ని చూస్తున్నార‌ట‌. ఇప్పటికే వీరి కాంబోలో విన‌య విధేయ రామ సినిమా వ‌చ్చింది. ఇప్పుడు మ‌రోసారి వీరిద్ద‌రు జోడీ క‌ట్టే ప్ర‌య‌త్నాలు కూడా ప్రారంభ‌మ‌య్యాయి. అయితే చ‌ర‌ణ్ ప‌క్క‌న ఆమె ఏ సినిమాలో న‌టిస్తుంది ? అన్న‌ది క్లారిటీ రావాలి. మొత్తానికి కియ‌రాతో జోడీ క‌ట్టేందుకు మ‌న తెలుగు హీరోలు త‌హ‌త‌హ‌లాడుతున్నార‌నే చెప్పాలి.

 

 

https://www.instagram.com/p/CFG6QHTjrIv/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news