ఓ ఎలుక కోసం ఇద్దరి మధ్య జరిగిన గొడవలో ఒకరి ప్రాణం పోయింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. 11 ఏళ్ల బాలుడు ఒకరు ఎలుకను పెంచుకుంటున్నాడు. ఈ ఎలుకను ఐదో తరగతి చదువుతోన్న ఓ బాలిక చంపేసింది. దీంతో ఆ బాలుడు కోపం పట్టలేక ఈ బాలికను చంపేశాడు. లసూడియా పరిధిలోని పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇందులో ఏదో తేడా ఉందని అనుకున్నా చివరకు బాలుడిని విచారిస్తే అన్ని విషయాలు చెప్పేశాడు.
తన ఎలుకను ఆ బాలిక చంపేయడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.. కోపం పట్టలేని ఆ బాలుడు ఓ బండరాయితో తలపై మోది చంపేశానిని నేరాన్ని అంగీకరించాడు. నేరం రుజువు కావడంతో ఆ మైనర్ బాలుడికి కోర్టు ఏం శిక్ష వేస్తుందో ? చూడాల్సి ఉంది. ముందుగా ఆ బాలుడిని బాల నేరస్తుల శిక్షణాలయానికి తరలిస్తామని పోలీసులు చెపుతున్నారు.
ఆ బాలుడిలో ఇలాంటి ఆలోచన రావడానికి ప్రధాన కారణం సినిమాలు మాత్రమే అని కూడా పోలీసుల విచారణలో తేలింది. ఇక పిల్లలలో మనిషి విలువ ఏంటో తెలయజెప్పాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులపై ఉందన్నారు.