కరోనా లాక్ డౌన్ వల్ల దారుణంగా ఎఫెక్ట్ అయిన సినిమాల లిస్ట్ చాలానే ఉంది. ఇందులో మెగా హీరో వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ ఉప్పెన కూడా ఉంది. వైష్ణవ్ తొలి సినిమా కావడంతో థియేటర్లలోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు. ఆరు నెలలుగా థియేటర్లు తెరిచే పరిస్థితి లేకపోవడంతో చివరకు ఉప్పెనను ఓటీటీలో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందా ? అని భావించారు. చివరకు ఓటీటీలో రిలీజ్‌కు భేరం ఆడితే రు. 13 కోట్లకు మించి ఆఫర్ రాలేదట.
పైగా కొత్త హీరో, కొత్త డైరెక్టర్ కావడంతో అంతకుమించి పెట్టేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదని టాక్..! అయితే ఈ సినిమాపై మైత్రీ మూవీస్ ఏకంగా రు. 25 కోట్ల వరకు పెట్టిందట. వడ్డీలు కలుపుకుంటే మొత్తం రు. 30 దాటేసిందని అంటున్నారు. శాటిలైట్, హిందీ డబ్బింగ్ కలిపినా, డిజిటల్ హక్కులు 13 కోట్లు వచ్చినా టార్గెట్ కు చాలా దూరంగా వుండిపోతుంది.
ఓటీటీకి ఇచ్చేస్తే భారీ నష్టాలు తప్పేలా లేవు. దీంతో చేసేదేం లేక థియేటర్ రిలీజ్‌కే రెడీ అవుతున్నారట. ఏదేమైనా ఇంకెన్ని రోజులు లేట్ అయితే అంత వడ్డీలు తడసి మోపెడు అయ్యేలా ఉన్నాయి. దీంతో ఉప్పెనకు బాక్సాఫీస్ దగ్గర భారీ టార్గెట్ తప్పేలా లేదు. లేకపోతే నిర్మాతలు నిండా మునగడం ఖాయంగానే కనిపిస్తోంది. వైష్ణవ్‌కు తొలి సినిమాతో పెద్ద కష్టం వచ్చిపడింది.