Moviesవాళ్లు వేధిస్తున్నారు... హైకోర్టును ఆశ్ర‌యించిన ర‌కుల్‌

వాళ్లు వేధిస్తున్నారు… హైకోర్టును ఆశ్ర‌యించిన ర‌కుల్‌

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ర‌కుల్‌ప్రీత్‌సింగ్ ప్ర‌స్తుతం వైష్ణ‌వ్ తేజ్ ప‌క్క‌న ఓ సినిమాలో న‌టిస్తోంది. ఇక కొద్ది రోజులుగా ఆమె పేరు డ్రగ్ ఇష్యూలో వినిపించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆమె పేరు మీడియాలో ఓ  రేంజ్‌లో వైర‌ల్ అవుతోంది. రియా చ‌క్ర‌వ‌ర్తి ఆమె పేరును కూడా చెప్పింద‌న్న‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ వార్త‌ల‌తో మీడియాలో ర‌కుల్ పేరే ఆడేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమె మీడియా త‌న‌ను వేధిస్తోంద‌ని ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించారు.

 

 

మీడియాను నియంత్రించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రకుల్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. సుశాంత్‌సింగ్ మృతి త‌ర్వాత తెర‌పైకి వ‌చ్చిన డ్ర‌గ్ కేసులో నార్కోటిక్ అదికారులు అతడి ప్రియురాలు రియా చ‌క్ర‌వ‌ర్తిని విచారిస్తోన్న క్ర‌మంలోనే రియా ర‌కుల్ పేరు చెప్పింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. డ్రగ్‌ కేసులో సారా అలీ ఖాన్, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సిమోన్‌ ఖంబట్టాలు దర్యాప్తులో ఉన్నట్లు ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్ ఓ జాతీయ మీడియాతో వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news