పైకి పెద్ద షో మాస్టర్. వేసే దుస్తులు, చెప్పుల నుంచి అన్నీ కాస్ట్లీవే. బడా రాజకీయ నేతల పేర్లతో విఐపీ సుఖాలు పొందుతూ ఉంటాడు. మనోడి పొజులకు చాలా మంది అమ్మాయిలు పడిపోతారు. ఆ తర్వాత అతడి వికృత క్రీడ మొదలవుతుంది. కొన్నేళ్లుగా అతడి అరాచకాలకు అడ్డే లేదు. ఈ కామాంధుడి అకృత్యాలు ఎట్టకేలకు ఓ 16 ఏళ్ల అమ్మాయి బయట పెట్టింది. మధ్యప్రదేశ్ లోని సాత్నా జిల్లాలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
సాత్నా జిల్లా కేంద్రానికి చెందిన మొహ్మద్ అతీఖ్ మన్సూరి (40) అనే వ్యాపారిని పోలీసులు అరెస్టు చేశారు. మనోడు గత కొంత కాలంగా అమ్మాయిలను వలలో వేసుకుని వారిపై అత్యాచారం చేస్తున్నాడు. కొందరికి డబ్బు ఆశతో.. కొందరిని ప్రేమ పేరుతో లొంగదీసుకుని వారిపై అత్యాచారం చేయడంతో పాటు వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. చివరకు 16 ఏళ్ల మైనర్ బాలికను కూడా ప్రేమ పేరుతో లోబరచుకుని రెండేళ్లుగా ఆమెపై అత్యాచారం చేస్తున్నాడు.
ఏడుగురు మహిళలను వీడియోలతో బెదిరించి నరకం చూపిస్తోన్న మన్సూరి ఈ మైనర్ బాలికను కూడా తీవ్రంగా వేధించాడు. దీంతో ఆమె ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు అతడిన అదుపులోకి తీసుకుని విచారించగా అతడి లీలలు వెలుగులోకి వచ్చాయి. మన్సూరీ బాధిత జాబితాలోని ఏడుగురు మహిళల్లో ఒకరిని అతను పెళ్లి కూడా చేసుకుని, కొంతకాలానికి వదిలేశాడని వెల్లడైంది. బీజేపీ మాత్రం ఇది లవ్ జీహాద్ అంటున్నా పోలీసులు మాత్రం కొట్టి పడేస్తున్నారు.