మ‌హేష్ సినిమాపై ఆ సెంటిమెంట్ న‌మ్ముకున్న రాజ‌మౌళి..!

ద‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళి ఆర్ ఆర్ ఆర్ ప్రాజెక్టు త‌ర్వాత సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబుతో సినిమా ఉంటుంద‌ని ప్ర‌క‌టించాడు. దుర్గా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై డాక్ట‌ర్ కేఎల్‌. నారాయ‌ణ ఈ సినిమాను నిర్మించ‌నున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాను 2021 జూలైలో నిర్మించ‌నున్నార‌ట‌. రాజ‌మౌళికి క‌లిసొచ్చిన సెంటిమెంట్ నెల జూలై. వ‌ర‌ల్డ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ బాహుబ‌లిని సైతం జూలైలోనే ప్రారంభించారు.

Mahesh Babu confirms film with SS Rajamouli- Cinema express

ఈ సెంటిమెంట్ మాత్ర‌మే కాదు.. రాజ‌మౌళి సూప‌ర్ హిట్ సినిమాలు అయిన మ‌గ‌ధీర‌, విక్ర‌మార్కుడు, సింహాద్రి లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌ను కూడా రాజ‌మౌళి జూలైలోనే ప్రారంభించాడ‌ట‌. అయితే అప్ప‌టికి ఆర్ ఆర్ ఆర్ చాలా వ‌ర‌కు షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.

Mahesh Babu-Rajamouli Project's Bitter Reality! Will The Director Take  Forever To Release The Movie? - Filmibeat

పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ఇత‌ర‌త్రా కార్య‌క్ర‌మాలు ఉన్నా అవి త‌ర్వాత ఫినిష్ చేసుకోవ‌చ్చు. ఇక మ‌హేష్ అప్ప‌ట‌కి స‌ర్కారు వారి కంప్లీట్ చేసుకుని మ‌హేష్ సినిమాకు ఫ్రీ అవుతాడు. అందుకే త‌న సెంటిమెంట్ ప్ర‌కారం ఈ సినిమా ప్రారంభోత్స‌వానికి జ‌క్క‌న్న జూలై నెల‌ను ఎంచుకున్నాడ‌ట‌.

Leave a comment