మహేష్‌బాబు నటించిన కొన్ని సినిమాలు వెండి తెరపై ప్లాప్ అయినా బుల్లితెరపై మాత్రం సూపర్ హిట్ కొట్టాయి. ఇందుకు అతడు, ఖలేజా సినిమాలే ఉదాహరణ. త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసిన ఈ రెండు సినిమాలు థియేటర్లో పెద్దగా ఆడలేదు. కానీ బుల్లితెరపై ఎప్పుడు వచ్చినా ఇప్పటకీ అదిరిపోయే టీఆర్పీ రేటింగులు వస్తాయి. ఇక అతడు బుల్లితెరపై ఇప్పటికే 1000 సార్లకు పైగా ప్రసారం అయ్యింది. అయినా ఇప్పటకీ ఈ సినిమాకు అదిరిపోయే వ్యూవర్షిఫ్ ఉంది.
ఈ క్రమంలోనే మహేష్ నటించిన మరో డిజాస్టర్ మూవీ ఆగడు యూట్యూబ్‌లో సరికొత్త సంచలన రికార్డు క్రియేట్ చేసింది. తమన్నా హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు శ్రీను వైట్ల దర్శకుడు. ఈ సినిమాను హిందీలో డబ్ చేసి యూట్యూబ్‌లో పెట్టారు. మొత్తం అన్ని భాషల్లో కలిపి ఆగడు సినిమాను యూట్యూబ్‌లో ఏకంగా 500 మిలియన్ల మంది చూశారు. ఓ తెలుగు సినిమకు ఈ రేంజ్లో వ్యూస్ రావడం పెద్ద సంచలనమే అని చెప్పాలి. ఇక మహేష్ మరో ప్లాప్ సినిమాలు సైనికుడు, బ్రహ్మోత్సవం సినిమాలకు కూడా యూట్యూబ్‌లో భారీ వ్యూస్ వచ్చాయి.