గత బిగ్‌బాస్‌లో విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి భూపాలం మధ్య నడిచిన సంథింగ్ సంథింగ్ రాహుల్ విన్నర్ అవ్వడంలో చాలా వరకు యూజ్ అయ్యింది. రాహుల్ పదే పదే ఎలిమినేషన్ అవ్వడంతో పాటు సేఫ్ అవ్వడం చివరకు ఫైనల్లో శ్రీముఖినే ఓడించడం జరిగింది. ఇక పునర్నవి సైతం నామినేషన్ అవ్వకుండా చాలా వారాల పాటు సేఫ్ అవ్వడంలో కూడా వీరి రిలేషన్లు, స్నేహాలు, గుసగుసలు కూడా కారణమయ్యాయి. ఇక బిగ్‌బాస్ 4లోనూ ఇలాంటి రిలేషన్ ఒకటి స్టార్ట్ అయినట్టు ప్రేక్షకులు గుసగుసలాడుకుంటున్నారు.
హీరో అభిజిత్, హీరోయిన్ మోనాల మధ్య ఈ సారి అలాంటి రిలేషన్ ఒకటి స్టార్ట్ అయినట్టే హౌస్‌లో వాతావరణం కనిపిస్తోంది. అభిజిత్, మోనాల్ అర్థరాత్రి ఏకాంతంగా గుసగుసలాడుకున్నారు. ఇక ఉదయం కూడా మళ్లీ మోనాల్, అభిజిత్ సీక్రెట్‌గా మాట్లాడుకోవడంతో వీరి మధ్య ఏదో ఉందన్న సందేహాలు ప్రేక్షకులకు కలుగుతున్నాయి. ఇదిలా ఉంటే అఖిల్ మోనాల్ గురించి కెప్టెన్ లాస్యకు ఏదో కంప్లెంట్ చేయబోయాడు.
ఇక అఖిల్ వద్దకు వచ్చి మోనాల్ ఏదో చెప్పాలని ప్రయత్నించగా… యదవ యాక్టింగ్‌లు వద్దని కాస్త సీరియస్ అయ్యాడు. నీకేం చేయాలో తెలియదా అని అఖిల్ అంటే మంచిగా మాట్లాడు అని మోనాల్ కూడా సీరియస్ అయ్యింది. ఏదేమైనా గత రాత్రి చర్చంతా మోనాల్ చుట్టూనే ఎక్కువ తిరిగింది. మరి అభిజిత్ – మోనాల్ కనెక్షన్ ప్రేక్షకులను ఎంత వరకు కనెక్ట్ చేస్తుందో ? చూడాలి.