అమెరికా ఎన్నికలు కరోనా వేళ కూడా మాంచి రసకందాయంగా మారుతున్నాయి. ఓ వైపు తాను తిరిగి వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. మరోవైపు డెమోక్రాటిక్ అభ్యర్థి జోబైడెన్ ఎలాంటి వివాదాలు లేని నేత కావండంతో ఈ సారి సర్వేలు అన్ని ఆయనవైపే మొగ్గు చూపుతున్నాయి. ఇదిలా ఉంటే డెమోక్రాటిక్ పార్టీ ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తోన్న భారతీయ సంతతిరాలు అయిన కమలా హ్యారీస్ తన పదునైప పంచ్‌లతో ట్రంప్‌ను ముప్పుతిప్పలు పెడుతున్నారు.
ఇక భారతీయులతో పాటు ఆసియా దేశాల ఓటింగ్ కూడా రోజు రోజుకు కమలాకు అనుకూలంగా మారుతోందని సర్వేలు చెపుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా కమలా హ్యారీస్ కరోనా వ్యాక్సిన్ అక్టోబర్‌లో వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్న మాటలను తాను నమ్మనని కమలా హ్యారిస్ ఆదివారం అన్నారు. వ్యాక్సిన్ పనితీరుతో పాటు సమర్థతపై ఖచ్చితమైన, నమ్మకం అయిన సమాచారం ఉంటే తప్పా తాను ట్రంప్ మాటలను నమ్మనని చెప్పారు.
ఇక అమెరికాలో కరోనా ఉధృతి ఇప్పటకీ తగ్గలేదు. ఇప్పటిదాకా 1.91 లక్షల మందికి పైగా మరణించారు. 63 లక్షల మంది ఈ వైరస్ బారినపడ్డారు. నవంబరు 3న జరిగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ట్రంప్ వ్యాక్సిన్‌పై ప్రకటనలు చేస్తున్నారే తప్పా… అంతకు మించి వ్యాక్సిన్ వస్తుందన్న నమ్మకం తనకు లేదని ఆమె చెప్పారు.