యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు పట్టాలెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించే సినిమాలో నటిస్తాడు. హారిక హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవల దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అయినను పోయిరావలె హస్తినకు అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమాను త్రివిక్రమ్ పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిస్తాడని అంటున్నారు. కంప్లీట్ పొలిటికల్ సెటైరికల్ డ్రామాగా తెరకెక్కే ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త టాలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో పూజా హెగ్డే పేరును త్రివిక్రమ్ ఫైనల్ చేశాడనే తెలుస్తోంది. గతంలో ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అరవింద సమేత సినిమాలో పూజానే హీరోయిన్.
ఇక ఇప్పుడు మరోసారి పూజనే త్రివిక్రమ్ రిపీట్ చేస్తున్నాడట.. ఈ వార్తలు ఇప్పటికే బయటకు వచ్చాయి. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ఈ సినిమాలో మరో హీరోయిన్గా రష్మిక మందన్న నటిస్తోందట. రష్మిక పాత్రకు ప్రాధాన్యం ఉందని… అందుకే ఆమె రెండో హీరోయిన్గా చేసేందుకు ఓకే చెప్పిందని తెలుస్తోంది. ఒకేసారి పూజ, రష్మికతో ఎన్టీఆర్ రొమాన్స్ అంటే ఇక ఫ్యాన్స్‌కు అంతకు మించిన పండగేం ఉంటుంది.