అవును! దుర్నీక్ష్య రాజకీయ నేతగా శత్రువులకూ మిత్రుడగా భాసిల్లగలిగిన నాయకుడు చంద్రబాబు. టీడీపీ అధినేతగా ఆయన పార్టీ పగ్గాలు చేపట్టినప్పుడు నందమూరి కుటుంబం మొత్తం ఆయనపై తిరగబడుతుందని అందరూ అనుకున్నారు. కానీ, చంద్రబాబు చతురత అక్కడే మొగ్గతొడిగింది. నందమూరి ఫ్యామిలీ మొత్తాన్ని తనవైపు తిప్పుకోగలిగారు. ఇప్పటికీ నందమూరి ఫ్యామిలీలో రాజకీయ హీరో ఎవరైనా ఉంటే.. ఎన్టీఆర్ తర్వాత బాబే. అనేక ఆటుపోట్లు ఎదురైనా పార్టీని ముందుకు నడిపించడంలో చంద్రబాబుదిట్టగా పేరు తెచ్చుకున్నారు. వైఎస్ హయాంలో 2009 ఎన్నికలు వచ్చినప్పుడు గెలువకపోతే..పార్టీ ఇక ఉండదంటూ.. కొందరుబాబుకుచెప్పారు.
అయితే, ఆ నాడు.. చంద్రబాబు మనోనిబ్బరంతో ముందుకు నడిచారు. తాను ఒక్కడై.. సైన్యాన్ని నడిపించారు. నిజానికి ఇప్పుడున్న పరిస్థితి చాలా చిన్నది. గతంతో పోల్చుకుంటే.. చంద్రబాబు ఎదుర్కొంటున్న వ్యతిరేకత కూడా చిన్నదే. ఇప్పుడు ఏపీలో యేడాది కాలంలోనే ప్రజలకు పరిస్థితి అర్థం అవుతోంది. చంద్రబాబును వ్యతిరేకించేవారు కూడా ఆయన విజన్‌ను వ్యతిరేకించకపోవడం ఓ పొలిటికల్ సీఈవోగా ఆయనకు నూటికి నూరు మార్కులు పడేలా చేస్తుండడం గమనార్హం. మరి ఈతరహా పరిస్తితి జగన్‌కు ఉందా? అంటే సందేహమే.
పార్టీని గెలిపించుకున్నారు కానీ, జగన్‌కు చంద్రబాబుకు చాలా తేడా ఉందనే టాక్ సొంత పార్టీలోనే నాయకుల నుంచి ఆఫ్‌ది రికార్డుగా వినిపిస్తున్న మాట. అదే సమయంలో వ్యతిరేకతను కూడా తనకు అనుకూలంగా మార్చుకున్న నాయకుడిగా బాబు పేరు తెచ్చుకున్నారు. కానీ, జగన్‌లో ఇలాంటి రాజకీయం మనకు ఎక్కడా కనిపించదు.
వ్యతిరేకత వస్తే.. రానీ.. అన్నట్టుగా వ్యవహరిస్తున్నారే తప్ప.. దానిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు మాత్రం జగన్ ప్రయత్నించకపోవడం గమనార్హం. ప్రజలకు నేతలకు మధ్య సమన్వయం వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా మిస్ అయ్యింది. అదే సమయంలో పార్టీని.. ప్రజలను అనుసంధానం చేయడంలోనూ ఇరువురి మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. ఏదేమైనా.. చంద్రబాబు గ్రాఫ్ చేరాలంటే.. జగన్‌కు చాలా కాలమే పడుతుందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.