తన భార్య పరీక్ష కోసం ఓ భర్త తన భార్యను ఎక్కించుకుని ఏకంగా 1000 కిలోమీటర్లు బైక్‌పై ప్రయాణం చేశారు. పదో తరగతి మధ్యలోనే చదువు ఆపేసిన భార్యకు టీచర్ కావాలన్న కోరిక ఉంది. మధ్యప్రదేశ్‌కు చెందిన ధనుంజయ్ వంట మనిషి. ఆయన భార్య సోని హెంబ్రామ్‌కు టీచర్ కావాలన్న కోరిక. అందుకే ఆమె మధ్యప్రదేశ్ బోర్డు అందించే ప్రాథమిక విద్య డిప్లోమా కోర్సులో చేరింది. ప్రస్తుతం సెకండియర్ చదువుతోంది. ఈ పరీక్షల సెంటర్ గ్వాలియర్. ఈ పరీక్ష కోసం వీరు గొడ్డా నుంచి పరీక్ష కేంద్రానికి వెళ్లారు. మధ్యలో దూరం 1100 కిలోమీటర్లు.
మూడు రోజుల పాటు వీరి జర్నీ సాగింది. సోనీ టీచర్ గొడ్డా నుంచి గ్వాలియర్ తీసుకు వెళతానని, అందుకు రు. 30 వేలు అవుతుందని చెప్పడంతో అంత డబ్బుల్లేని ఈ దంపతులు బైక్‌పై జర్నీ చేసేశారు. పైగా సోని ఇప్పుడు ఆరో నెల గర్భవతి. ఆగస్టు 27న ప్రారంభమైన వీరి జర్నీ ఆగస్టు 30వ తేదీ సాయంత్రం గ్వాలియర్‌కు చేరుకోవడంతో ముగిసింది.
బంధువుల దగ్గర రు. 10 వేలు తీసుకుని గ్వాలియర్ వచ్చిన వీరు ఉండడానికి రు. 1500 చెల్లించి ఓ గది అద్దెకు తీసుకున్నారు. ధనుంజయ్ మాట్లాడుతూ ఇప్పటికే తాము రు. 7 వేలు ఖర్చు చేశాం అని… ఇప్పడు తమ వద్ద 3 వేలు మాత్రమే ఉన్నాయని చెప్పాడు. తన భార్య ఆరు నెలల గర్భవతి కావడంతో ఆనారోగ్యంతో బాధపడుతోందని చెప్పాడు. ఇప్పుడు వీరి జర్నీ నేషనల్ వైడ్‌గా వైరల్ అవుతోంది.