Moviesటాలీవుడ్‌లో ఆ రికార్డు... ఫ‌స్ట్ బ‌న్నీ.. నెక్ట్స్ బెల్లంకొండ‌దే..

టాలీవుడ్‌లో ఆ రికార్డు… ఫ‌స్ట్ బ‌న్నీ.. నెక్ట్స్ బెల్లంకొండ‌దే..

తెలుగు సినిమాల హిందీ వెర్షన్‌లు యూట్యూబ్‌లో సంచలనాలు నమోదు చేస్తున్నాయి. ఇక్క‌డ హిట్‌, ప్లాపుల‌తో సంబంధం లేకుండా మ‌న హీరోల మాస్, యాక్ష‌న్ సినిమాలు హిందీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మ‌న సినిమాలు హిందీలో డ‌బ్ చేసి యూట్యూబ్‌లో పెట్ట‌డం ఆల‌స్యం ఫైట్లు, డ్యాన్సులు విప‌రీతంగా చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే బెల్లంకొండ శ్రీనివాస్, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన జయజానకీనాయక సినిమా హిందీ వెర్షన్ యూట్యూబ్‌లో సత్తా చాటుతోంది.

ఈ సినిమా హిందీ వెర్ష‌న్ యూ ట్యూబ్‌లో ఏకంగా 300 మిలియ‌న్లు ( 30 కోట్లు) వ్యూస్ సాధించింది. ఓ తెలుగు సినిమా హిందీ డ‌బ్బింగ్ వెర్ష‌న్ 300 మిలియ‌న్ల వ్యూస్ సాధించ‌డం పెద్ద రికార్డే. ఈ ఘ‌న‌త సాధించిన రెండో సినిమాగా జ‌య జాన‌కీ నాయ‌క సినిమాగా నిలిచింది. తొలి స్థానంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరైనోడు సినిమా ఉంది. ఈ రెండు సినిమాలను బోయపాటి శ్రీను తెరకెక్కించడం విశేషం.

ఇక బెల్లంకొండ యాక్ష‌న్ సినిమాలు ఇక్క‌డ ప్లాప్ అయినా అత‌డి హై ఓల్టేజ్ యాక్ష‌న్ సీన్లు హిందీ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటున్నాయి. అందుకే హిందీ మాస్ ప్రేక్ష‌కులు ఆ సినిమాలు యూ ట్యూబ్‌లో విప‌రీతంగా చూస్తుండ‌డంతో మంచి వ్యూస్ వ‌స్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news