బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్‌ను ప్రేమించిన రియా అతడి ఆత్మహత్యకు కారణం అయ్యిందా అన్న కోణంలో విచారణలు సాగుతున్నాయి. అనేక అనుమానాలు ముసురుకున్నాయి. ఇప్పుడు రియా ఎలాంటి ఒత్తిళ్లతో సతమతమవుతోందా సరిగ్గా 30 సంవత్సరాల క్రితం బాలీవుడ్ సీనియర్ నటి రేఖ సైతం ఇదే సమస్య ఎదుర్కొంది. ఇప్పుడు చాలా మంది రేఖను, రియాను పోలుస్తున్నారు. రేఖకు అమితాబచ్చన్‌కు ఉన్న రిలేషన్ అప్పట్లో పాపులర్. ఆ తర్వాత రేఖ చాలా రోజులు ఖాళీగా ఉండి ముఖేష్ అని బిజినెస్‌మేన్‌ను పెళ్లి చేసుకుంది.
ముఖేష్‌కు వ్యాపారంలో నష్టం రావడంతో పాటు ఇతరత్రా కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు. రేఖ దుపట్టాతోనే ముఖేష్ ఉరేసుకున్నాడు. దీంతో ముఖేష్ కుటుంబ సభ్యులు అందరూ రేఖ వల్లే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. పెళ్లి అయిన కేవలం ఏడు నెలల్లోనే అలా జరగడంతో రేఖ మీద ఎక్కువ అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే దీనిపై రేఖ మాట్లాడుతూ ముఖేష్ ఎప్పుడూ డిప్రెషన్‌తో ఉండేవాడని… ఎన్నిసార్లు చెప్పినా దాని నుంచి బయట పడలేదని గతంలో పేర్కొంది. ఇది తన జీవితంలోనే పెద్ద విషాదంగా మిగిలింది.
1990 అక్టోబర్ 2న ముఖేష్ తన గదిలోనే ఉరి వేసుకుని మృతి చెందాడు. దీనిపై ముఖేష్ బంధువులు రేఖ వల్లే ఇలా జరిగిందన్న ఆరోపణలు చేశారు. రేఖను పెళ్లి చేసుకున్నాకే అతడికి మనశ్శాంతి లేదన్నారు. దీంతో అప్పుడు రేఖ ఎదుర్కొన్న సమస్యలే ఇప్పుడు రియా కూడా ఎదుర్కొంటున్నారంటూ కొందరు బాలీవుడ్ ప్రముఖులు పోలిక పెడుతున్నారు. అయితే రియా ఇప్పుడు సుశాంత్‌ను పెళ్లి చేసుకోలేదు.